Home » NDA Alliance
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మే 13వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అధికాక నిన్న మెజార్టీ సర్వేలు ఎక్సిట్ పోల్స్‌లో కూడా ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టనుందని తెలిపాయి.
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీజీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏడోవిడత ఎన్నికల ప్రచారం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ఖర్గే మాట్లాడారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది. శనివారం ఏడో విడత పోలింగ్‌తో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఎన్నికల ఫలితాల కోసం జూన్4 వరకు నిరీక్షించాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు.. నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో మాత్రం..
లోక్‌సభ ఎన్నికల(Lok Sabha election 2024) ఆరో దశ(Phase 6) ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా.. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.
కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission of India) జనసేన పార్టీ (Jana Sena) బుధవారం లేఖ రాసింది. తిరుపతిలో, రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు, అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. మెజార్టీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మరో రెండు దశలు పూర్తైతే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఐదు విడతల పోలింగ్ ముగిసింది. ఆరో విడత పోలింగ్ ఈనెల 25వ తేదీన జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చుని గెలివాలని కాని ఆ పరిస్థితి లేదని చెప్పారు.
ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పని చేయడమే తనకు తెలుసని.. ప్రజాసేవకే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. పదవుల కోసం, గుర్తింపు కోసం ఆలోచించనని.. తాను కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) తప్పకుండా అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 9న జగన్ సీఎంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. వేదిక ఎక్కడో రెండు రోజుల్లో చెబుతానని అన్నారు. కేంద్రంలో తమ మీద ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటానని... ఇది తన స్వార్థమని తెలిపారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగిన తర్వాత.. రాష్ట్రంలో పలు అల్లర్లు జరుగుతుండటంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు, నిధుల వ్యయంపై ఫిర్యాదు చేశారు.