Share News

AP Elections2024 : ఎగ్జిట్ పోల్స్ కంటే కూటమికి ఎక్కువ స్థానాలు: అప్పలనాయుడు

ABN , Publish Date - Jun 02 , 2024 | 08:12 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అధికాక నిన్న(శనివారం) మెజార్టీ సర్వేలు ఎక్సిట్ పోల్స్‌లో కూడా ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టనుందని తెలిపాయి. దీంతో కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AP Elections2024 : ఎగ్జిట్ పోల్స్ కంటే కూటమికి ఎక్కువ స్థానాలు: అప్పలనాయుడు
Kalisetti AppalaNaidu

విశాఖపట్నం: ఏపీ సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అధికాక నిన్న(శనివారం) మెజార్టీ సర్వేలు ఎక్సిట్ పోల్స్‌లో కూడా ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టనుందని తెలిపాయి. దీంతో కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సిట్ పోల్స్(Exit Polls) ప్రకటించిన ఫలితాలపై విజయనగరం కూటమి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు (Kalisetti AppalaNaidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఎగ్జిట్ పోల్స్ చెప్పిన కంటే కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయన్నారు.


రాష్ట్రంలోనూ, దేశం లోనూ ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలయికను ప్రజలు ఆమోదించారని అన్నారు. ఉత్తరాంధ్రలో ఐదు ఎంపీ స్థానాలు, అధికంగా ఎమ్మెల్యే స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతుందని ప్రజలే చెబుతున్నారన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు కావాలని ప్రజలు కోరుకున్నారని చెప్పారు.ప్రకృతి వనరులను కాపాడే వ్యక్తి కనుక ప్రకృతి చంద్రబాబు ఆహ్వానిస్తోందని తెలిపారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన తనను చంద్రబాబు, లోకేష్‌లు ప్రోత్సహించి విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు.కూటమిని ఆదరించినందుకు ఉత్తరాంద్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Supreme Court: పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దుపై రేపు సుప్రీంలో విచారణ

AP Elections 2024: ఆరా మస్తాన్ సర్వే ఎవరి తరఫున చేశారు.. ఖర్చు ఎంత..!?.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

AP Elections 2024: కౌంటింగ్ రోజు ఘర్షణలు సృష్టించే అవకాశం: నాందెడ్ల మనోహర్

For more latest Andhrapradesh news and Telugu news..

Updated Date - Jun 02 , 2024 | 10:53 PM