Home » Narendra Modi
పశ్చిమాసియా పరిస్థితుల దృష్ట్యా దేశ ఇంధన భద్రత, నిత్యావసర వస్తువుల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ IGoM సమావేశాన్ని నిర్వహించి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు.
ఎన్నికల మేనిఫెస్టో అమలుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కాబోయే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారిస్తామన్నారు.
సోమనాథ్ ఆలయాన్ని పురర్నిర్మించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన అమృత మహోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మోదీ జవాబుదారీతనాన్ని కోల్పోయారని అన్నారు. ప్రజలు ఏం కొనాలో.. ఏం కొనకూడదో చెప్పే పరిస్థితికి మోదీ వచ్చారంటూ మండిపడ్డారు.
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పార్టీ తొలిసారి అద్భుత విజయం సాధించిందని, తెలంగాణలోనూ బెంగాల్ పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గత 11 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం రూ. 12 లక్షల కోట్ల నిధులను కేటాయించిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అందరినీ వెన్నుపోటు పొడిచిందని, ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ ఇంటికి వెళ్లారు. పవన్‌ను పరామర్శించారు.
భాగ్యనగరంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగాలను సృష్టించనున్నాయని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మోదీని సత్కరించారు.
మరికాసేపట్లో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు.