PM Modi: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ స్పందన.. పరిహారం ప్రకటన
ABN , Publish Date - Jun 04 , 2025 | 08:12 PM
బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు.
బెంగళూరులో జరిగిన తొక్కిసలాట (Bangalore Stampede) ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (narendra modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన దుర్ఘటన హృదయ విదారకమైనదని, ఈ కష్ట సమయంలో తమ ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. దీంతోపాటు మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
రెండు లక్షల మందికిపైగా..
బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ వేడుకల్లో జరిగిన తొక్కిసలాట భయానక దృశ్యాల్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది మరణించారు. ఈ విషాదకర ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా స్పందించారు. ఈ వేడుకలకు మేము ఊహించలేని విధంగా జనాలు వచ్చారని సీఎం అన్నారు. స్టేడియం సామర్థ్యం 35,000 మంది కాగా, అనూహ్యంగా రెండు నుంచి మూడు లక్షల మంది హాజరయ్యారని వెల్లడించారు.
రూ. 10 లక్షల పరిహారం..
అంత భారీగా జనాలు రావడం వల్ల సరైన ఏర్పాట్లు చేయడానికి సమయం సరిపోలేదని సీఎం సిద్ధరామయ్య వివరించారు. ఇదే సమయంలో సీఎం మెజిస్ట్రేట్ స్థాయి విచారణకు ఆదేశించారు. దీంతోపాటు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, గాయపడినవారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ప్రభుత్వం బాధితులకు పూర్తిగా సపోర్ట్ చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి