Home » Nara Chandra Babu Naidu
మొన్న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్ రెడ్డి (CM Jagan) ని టార్గెట్ చేస్తూ ఒక షూటర్‌తో టీడీపీ నేతలు కొట్టించారని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆరోపించారు. సోమవారం నాడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు రాయితో జగన్‌ని కొట్టించడం, నిన్న గులక రాళ్లతో దాడి చేయించుకోవడం ఎందుకని ప్రశ్నించారు. జగన్ యాక్టర్ కాదు, రియల్ ఫైటర్ అని కొనియాడారు.
విశాఖ: గాజువాక సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై రాళ్ల దాడి వెనుక వైసీపీ హస్తం ఉన్నట్లు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి సిఎం జగన్‌పై గులక రాయి దాడికి నిరసనగా.. చంద్రబాబుపై దాడి చేస్తామని వైసీపీ అభిమాని చక్రి ధర్మపురి ముందే చేసిన హెచ్చరిక వాట్సాప్ గ్రూపులో హల్ చల్ చేసింది.
వైసీపీ సర్కార్ ఆకృత్యాలు పరాకాష్టకు చేరాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Uma Maheswara Rao) మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), జనసేన అధినేత (Pawan Kalyan) పై రాళ్లదాడి పిరికిపంద చర్య అని చెప్పారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.
బాంబులకే తాను భయపడలేదు...రాళ్లకు భయ పడతానా..? అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఆదివారం నాడు గాజువాకలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు చంద్రబాబుపై రాళ్లు విసిరారు.
రాజధాని అంటే నాలుగు బిల్డింగులని ఈ మూర్ఖులు అనుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. అవైతే ఎప్పుడో కట్టేశానని.. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కట్టానని గుర్తుచేశారు. కానీ వాటితో రాజధాని కాదన్నారు. ‘రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం.. ఆత్మవిశ్వాసం. గర్వంగా చెప్పుకొనే ప్రజల ఆస్తి.
అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేశారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. శనివారం నాడు ప్రత్తిపాడులో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజం గెలవాలి ఎన్డీఏ రావాలి హ్యాష్ ట్యాగ్.. దేశవ్యాప్తంగా ఎక్స్ ఖాతాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై చనిపోయిన అన్నీ కుటుంబాలని నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి పరామర్శించారు.
నవరత్నాలతో సీఎం జగన్ (CM Jagan) ప్రజలను మోసం చేశారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. శనివారం నాడు కదిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నరసింహ స్వామి కదిరి ప్రాంతాన్ని కాపాడుతున్నారని తెలిపారు.
ఏపీ సార్వత్రిక ఎన్నిక ( AP Election 2024)ల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుడంటంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గెలుపు వ్యూహాలపై పదును పెట్టారు. ఇందులో భాగంగానే బాపట్ల పార్లమెంట్‌లోని అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశానికి కూటమి నేతలు కూడా హాజరయ్యారు.