Home » Nara Chandra Babu Naidu
విజయనగరం జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయడు విజయనగరం జిల్లాలో రెండోరోజు మంగళవారం పర్యటిస్తున్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా బొండపల్లిలో నిర్వహించిన మహిళా సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమరావతి: కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తానని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓ ఆడబిడ్డ జగ్గంపేటలో తనను కలిసినప్పుడు పెన్ ఇచ్చిందని, ఆ పెన్నుతో సీఎం అయ్యాక డీఎస్సీపై తొలి సంతకం చేయాలని కోరిందని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రమంతా మాదకద్రవ్యాల మయమైపోయిందని తెలుగుదేశం జాతీ య అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. సోమవారం నాడు విజయనగరంలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) నాయకుల అక్రమాలు పెరిగిపోతున్నాయని వీటిని అణిచేద్దామని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మాఫియాను ఏపీ నుంచి తరిమేద్దామని హెచ్చరించారు.
అనుహ్య పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు తెలుగుదేశం (Telugu Desam).. పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి (Giddi Eswari) ఎమ్మెల్యే టికెట్ దక్కింది. స్థానిక ఎమ్మెల్యే స్థానానికి టికెట్ కోసం గిడ్డి ఈశ్వరితో పాటు పార్టీ సీనియర్ నేతలు కొట్టగుళ్లి సుబ్బారావు, ఎంవీవీ ప్రసాద్ ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పాడేరు అసెంబ్లీ స్థానం బీజేపీకి (BJP) కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ..
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. స్థానికంగా ఉన్న పరిస్థితులు.. ఇప్పటికే ఇచ్చిన అభ్యర్థులు ప్రచారంలో వేగం లేకపోవడం వంటి అంశాలతో మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించింది.
సినీనటులు చిరంజీవి తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం మంచిదని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే పార్లమెంట్ (Parliament), అసెంబ్లీ (Assembly) అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆదివారం నాడు బీ ఫామ్స్ (B forms) అందజేశారు. బీ ఫామ్స్ అందజేసిన తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) సమయం ఆసన్నమైంది. దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం (Telugu Desam) పార్టీ ఓల్టేజ్ పెంచింది!. 144 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 17 మంది పార్లమెంట్ అభ్యర్థులను టీడీపీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో చేసిన మార్పులు, చేర్పులు.. కూటమికి ఇచ్చిన స్థానాలతో ఆగ్రహావేశాలు ఇలా ఎన్నెన్నో జరిగాయి. ఆఖరికి నామినేషన్లకు సమయం ఆసన్నమైంది. ఆదివారం నాడు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు చంద్రబాబు బీఫామ్‌లు ఇచ్చి.. ప్రమాణం కూడా చేయించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో ఆదివారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు చంద్రబాబు బీ.ఫామ్స్ ఇస్తున్నారు.