Home » Nalgonda
టెంపు ల్ సిటీలో సమీకృత మార్కెట్ భవన సముదాయం పనులు కన్నేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అన్న చందంగా పనులు సాగుతు న్నా యి.
పదో తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధిస్తే విమాన ప్రయాణం చేయిస్తానని కేజీబీవీ విద్యార్థినులకు జిల్లా కలెక్టర్ హామీపత్రం రాసి ఇచ్చారు.
మద్యం తాగి గ్రామంలో తిరిగేవారిని గుర్తించి సమాచారమిస్తే రూ.10 వేల నజరానా ఇస్తామని మహిళా సంఘం నేతలు ప్రకటించారు.
సర్కిల్ ఇన్‌స్పెక్టర్(సీఐ)ని బెదిరించి రూ.1.10 లక్షలు వసూలు చేసిన ఇద్దరు జర్నలిస్టులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు వివరాలను వెల్లడించారు.
పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యమైన మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఘటన విషాదాంతమైంది.
Telangana: సూర్యాపేటలో దారుణ హత్యకు గురైన కృష్ణ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్గవి కుటుంబసభ్యులే కృష్ణను హత్య చేసినట్లు తెలుస్తోంది. రాత్రంతా మృతదేహాన్ని కారులోనే తిప్పుతూ చివరకు మూసీ కాలువ వద్ద పడేశారు నిందితులు.
వినతులు, ఆవేదనలు, అసంతృప్తులు, ఆగ్రహాలు, నిరసనలు, ఆనందాలు! ఇలా పథకాల్లో తమ పేర్ల నమోదుకు సంబంధించి ఆశావహుల ద్వారా గ్రామసభల్లో వ్యక్తమైన రకరకాల భావోద్వేగాలు!!
రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందంటూ నల్గొండలో బీఆర్‌ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతిచ్చింది.
రైతుల సమస్యలపై నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం బీఆర్‌ఎస్ నిర్వహించాలని నిర్ణయించిన మహాధర్నా వాయిదాపడింది.
అమెరికాలో ఉన్నత చదువు పూర్తిచేసుకున్న కుమారుడు, త్వరలో మంచి కొలువు సాధించి, కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు దిగ్ర్భాంతికరమైన వార్త చెవినపడింది!