Share News

Amrutha: ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:55 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో సోమవారం నల్లగొండ కోర్టు వెలువరించిన తీర్పుపై అమృత తొలిసారి స్పందించారు.

Amrutha: ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం

  • ప్రణయ్‌ హత్య కేసు తీర్పుపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అమృత

నల్లగొండ, మార్చి 11 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో సోమవారం నల్లగొండ కోర్టు వెలువరించిన తీర్పుపై అమృత తొలిసారి స్పందించారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత తమకు న్యాయం జరిగిందని ఆమె మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ వే దికగా పేర్కొన్నారు. ఈ తీర్పుతోనైనా పరువు పేరిట జరిగే దారుణాలు ఆగుతాయని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.


ఈ ప్రయాణంలో తమకు అండగా నిలిచిన పోలీసులు, న్యాయవాదులు, మీడియాకు ఆమె ధన్యవాదా లు తెలిపారు. తన బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే తాను మీడియా ముందుకు రాలేకపోయానని, దయతో తమను అర్థం చేసుకోవాలని అమృత విజ్ఞప్తి చేశారు. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ ప్రణయ్‌ అంటూ ఆమె పోస్ట్‌ను ముగించారు.

Updated Date - Mar 12 , 2025 | 04:55 AM