• Home » N. Biren Singh

N. Biren Singh

Manipur CM: మణిపూర్‌ త్వరలోనే చక్కబడుతుంది: బీరేన్ సింగ్

Manipur CM: మణిపూర్‌ త్వరలోనే చక్కబడుతుంది: బీరేన్ సింగ్

రెండు నెలలకు పైగా హింసాకాండతో విలవిల్లాడుతున్న మణిపూర్‌లో త్వరలోనే యథాపూర్వ పరిస్థితిలు నెలకొంటాయని, అందుకోసం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ తెలిపారు. సీఎం రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను తోసిపుచ్చారు. మణిపూర్ ప్రజల కోసం తాను పనిచేస్తున్నానని చెప్పారు.

Manipur : మణిపూర్ ఘర్షణలు.. ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు..

Manipur : మణిపూర్ ఘర్షణలు.. ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు..

మణిపూర్‌లో ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కుకీ-నాగా, కుకీ-పెయిటీ, కుకీ-మెయిటీ తెగల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఫలితంగా వందలాది గ్రామాలు బూడిద కుప్పలవుతాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు, వందలాది మంది గాయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరు కొన్ని నెలల తరబడి హింసను కొనసాగిస్తూ ఉంటారు.

Mizoram : మెయిటీలకు మిలిటెంట్ల హెచ్చరిక.. మిజోరాం నుంచి మణిపూర్‌ వెళ్లిపోతున్న మెయిటీలు..

Mizoram : మెయిటీలకు మిలిటెంట్ల హెచ్చరిక.. మిజోరాం నుంచి మణిపూర్‌ వెళ్లిపోతున్న మెయిటీలు..

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అవడంతో మిజోరాంలోని ఓ సంఘం రాసిన లేఖ మెయిటీలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మహిళలపై జరిగిన దారుణంపై మిజో యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, స్వీయ రక్షణ కోసం మెయిటీలు మిజోరాం నుంచి వెళ్లిపోవాలని ఈ లేఖలో హెచ్చరించారు.

Manipur : మణిపూర్ యువతపై మద్యం ప్రభావం : ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల

Manipur : మణిపూర్ యువతపై మద్యం ప్రభావం : ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల

మణిపూర్‌లో మే 3 నుంచి జరుగుతున్న హింసాకాండపై ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి విజ్ఞప్తి చేశారు. యువతపై మద్యం విపరీత ప్రభావం చూపుతోందని, గృహహింసకు దీనికి సంబంధం ఉందని తెలిపారు.

Biren Singh: రాజీనామాపై  సమాధానం దాటవేసిన సీఎం

Biren Singh: రాజీనామాపై సమాధానం దాటవేసిన సీఎం

మణిపూర్‌‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన పార్లమెంటును సైతం కుదిపేయడంతో శాంతి భద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎం ఎన్.బైరేన్ సింగ్ రాజీనామా చేయాలనే డిమాండ్లు మరోసారి ఊపందుకున్నాయి. అయితే, రాష్ట్రంలో శాంతిభద్రతలు పునరుద్ధరించడమే తన పని అని, బాధ్యులైన వారిపై కఠిన చర్చలు తీసుకుంటామని సీఎం చెప్పారు.

Manipur video : మహిళలను నగ్నంగా ఊరేగించడానికి కారణం వదంతులే : మణిపూర్ పోలీసులు

Manipur video : మహిళలను నగ్నంగా ఊరేగించడానికి కారణం వదంతులే : మణిపూర్ పోలీసులు

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు కారణం వదంతులేనని మణిపూర్ పోలీసు వర్గాలు తెలిపాయి.

Manipur : మణిపూర్‌ మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై సుప్రీం సీజే ఆవేదన

Manipur : మణిపూర్‌ మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై సుప్రీం సీజే ఆవేదన

రెండున్నర నెలల నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన, బాధ వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ప్రకటించారు.

Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్

Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్

రెండు నెలల నుంచి మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ (Manipur Chief Minister N Biren Singh) ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ హింస చెలరేగుతున్నట్లు కనిపిస్తోందన్నారు.

Manipur : హైడ్రామా మధ్య రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సీఎం

Manipur : హైడ్రామా మధ్య రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సీఎం

హైడ్రామా మధ్య తన రాజీనామా నిర్ణయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ శుక్రవారంనాడు వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుతుల్లో తాను రాజీనామా చేయడం లేదంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు. దీంతో ఆయనకు మద్దతుగా ఉదయం నుంచి నుపిలాల్ క్లాంప్లెక్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు శాంతించారు.

Manipur : మణిపూర్ ముఖ్యమంత్రికి మద్దతుగా భారీ ప్రదర్శన

Manipur : మణిపూర్ ముఖ్యమంత్రికి మద్దతుగా భారీ ప్రదర్శన

దాదాపు రెండు నెలల నుంచి హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి మద్దతుగా పెద్ద సంఖ్యలో మహిళలు శుక్రవారం నుపి లాల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని, ఈ సంక్లిష్ట సమయంలో రాజీనామా చేయవద్దని బిరేన్ సింగ్‌ను డిమాండ్ చేశారు.

N. Biren Singh Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి