Home » Miss World 2025
హైదరాబాద్ నగరంలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలను తిలకించేందుకు జారీచేసే పాస్‌లకు అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ పోటీలను తిలకించేందుకు ఇప్పటికే ఏకంగా 7వేల మందికి పైగా ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
Miss World competitions: మిస్ వరల్డ్ పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలు భారతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక మేలవింపుగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వీవీఐపీ బ్లాకులు, మీడియా గ్యాలరీ, భద్రత, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు.
అందాల పోటీలు కేవలం అందాన్ని ప్రదర్శించడానికి కాదు.. అందమైన విజయాలు సాధించడానికి, మహిళలకు అందమైన స్ఫూర్తి కలిగించడానికి, సంతోషాలతో కూడిన అందమైన ప్రపంచాన్ని సృష్టించడానికి.. అని మిస్ వరల్డ్ సంస్థ చైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లీ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మిస్‌వరల్డ్ పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సైబరాబాద్ జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.
Rural Tourism:120 దేశాల ప్రతినిధులు హాజరయ్యే.. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యే మిస్ వరల్డ్ పోటీలు ఈవెంట్‌లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, గ్రామీణ పర్యాటకంకు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖంగా ప్రమోట్ చేసేందుకు , పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులను ఆకర్షించుకునేందుకు తద్వారా గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.
మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు సమీపిస్తుండడంతో అందాల భామల రాక జోరందుకుంది. బుధవారం వరకు 86 దేశాలకు చెందిన అందాలభామలు హైదరాబాద్ చేరుకున్నారు.
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం గర్వకారణమని మంత్రి జూపల్లి తెలిపారు. ఈ పోటీలు రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి తోడ్పడతాయని, ప్రపంచానికి మన సంస్కృతిని చాటే వేదికవుతాయని అన్నారు.
Miss World 2025 Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మే 10 నుంచి మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలోని ఈ ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లను నిషేధించారు.