Home » Medical News
రాబోయే రోజుల్లో హైదరాబాద్ డేటా సిటీగా మారనుందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలని, అధునాతన విధానాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాబోయే పదేళ్లలో తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఏపీలో ఓపీ, ఐపీ సేవలు భారీగా పెరిగాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సూపర్ స్పెషాలిటీలో 59శాతం వేకెన్సీలు ఉన్నాయని చెప్పారు. టెలి మానస్‌లో భాగంగా మానసిక కౌన్సెలింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో (MHSRB) 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ పోస్టులకు అర్హతలు ఏంటి, ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
కాకినాడ జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాలలో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులని ల్యాబ్ టెక్నీషియన్ లైంగిక వేధింపులకి గురిచేశాడు. బీఎస్సీ, ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినులపై ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి వికృత చేష్టలకి పాల్పడ్డాడు.
వైద్యఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మెడికల్ బోర్డు సెక్రటరీ గోపికాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్లోబల్ కేపబులిటీ సెంటర్ జీసీసీను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని, దీనికి రాష్ట్రప్రభుత్వం సహకరిస్తోందని ప్రముఖ ఫార్మా కంపెనీ ఇసాయ్ గ్లోబల్ సీఈవో మకోటో హోకెట్స్ ప్రకటించారు.
వికారాబాద్ జిల్లా పరిగిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆరు నెలల గర్భిణికి అబార్షన్ చేసిన ఉదంతం ఉద్రిక్తతకు దారితీసింది. తమకు తెలియకుండా అబార్షన్ చేశారని ఆమె అత్తమామలు, వారి తరపు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి అమానుష ఘటన వెలుగుచూసింది. పట్టణానికి చెందిన గాయత్రి ఆస్పత్రిలో లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఇద్దరికి అబార్షన్లు చేసినట్లుగా సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు ఆస్పత్రిపై దాడులు చేశారు.
రాష్ట్రంలో వైద్యవిద్యను గాడిన పెట్టే క్రమంలో సర్కారు రికార్డు స్థాయిలో అధ్యాపకుల నియామక ప్రక్రియను చేపట్టింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భారీగా భర్తీ చేసేందుకు సిద్ధమైంది.
కొత్త టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మెడికల్, డయాగ్నస్టిక్స్ ఎక్విప్మెంట్, ఫర్నీచర్ త్వరగా కొనుగోలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు.