Home » Medak
మెదక్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. ఒక వైపు కన్నతండ్రి భౌతికకాయం ఇంట్లో ఉండగానే.. మరోవైపు తన భవిష్యత్తు కోసం ఆ విద్యార్థి కన్నీటి పర్యంతమవుతూ పదోతరగతి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు, ఉపాధ్యాయులు కంటతడి పెట్టారు.
మెదక్ జిల్లా ఏడుపాయల శివారలో జరిగిన మహిళ హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. అనుమానం పెను భూతమైంది.. వేరే వ్యక్తితో మాట్లాడుతోందన్న అనుమానంతో ప్రియుడు కర్రతో అతి దారుణంగా కొట్టి చంపినట్లు మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించారు.
జహీరాబాద్ ప్రాంతంలో సహజసంపదను కొల్లగొట్టేందుకు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎర్రరాయి, మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకునే క్రమంలో ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు.
మద్యానికి డబ్బులు లేకపోవడంతో కన్నబిడ్డనే విక్రయించింది కసాయి తల్లి. మెదక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ధర పాతాళానికి పడిపోవడంతో ఉల్లి రైతు కన్నీరు పెడుతున్నాడు.
పారిశ్రామిక ప్రాంతాలు కాజీపల్లి, గడ్డపోతారం పరిధిలో చిరుత సంచారం స్థానికంగా భయాందోళనలు కలిగిస్తుండగా.. గురువారం దూడ పై దాడి చేసి చంపివేసిన ఘటన కార్మిక వర్గలు, స్థానిక గ్రామాలలో కలకలం రేపింది.
మెదక్ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానపరిచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పట్టణం నడిబొడ్డున ఉన్న రాందాస్ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు పేడ పూసి పరారయ్యారు.
వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు.
కోతుల బెడదను అరికట్టేందుకు కోహెడ మండలం నకిరేకొమ్ములలో ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.