Medak: నవ వధువు ఆత్మహత్య..
ABN , Publish Date - May 04 , 2025 | 05:02 AM
అడ్డుకోబోయిన పోలీసులు, వార్త సేకరణకు వచ్చిన విలేకరుల పైనా దాడికి పాల్పడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
చిన్నశంకరంపేట, మే 3 (ఆంధ్రజ్యోతి): పెళ్లయిన మూడునెలలకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డలం అగ్రహారానికి చెందిన వట్టెం మహే్‌షకు, వెల్దుర్తి మండలం శేరిలాకు చెందిన పూజ(24)తో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహమైంది.
శనివారం ఉదయం పూజ ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీంతో పూజను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆమె తల్లిదండ్రులు, బంధువులు.. మహేష్ కుటుంబంపై దాడికి పాల్ప డ్డారు. అడ్డుకోబోయిన పోలీసులు, వార్త సేకరణకు వచ్చిన విలేకరుల పైనా దాడికి పాల్పడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.