• Home » Mancherial

Mancherial

అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానం కాంగ్రెస్‌ కైవసం

అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానం కాంగ్రెస్‌ కైవసం

ఏడాది కాలంలో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. 2023 డిసెంబరు 3న వెలువడ్డ ఎన్నికల ఫలితాలు జిల్లా రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీశాయి. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్‌ పార్టీ హస్తగతం చేసుకుంది. మూడు నియోజక వర్గాల్లో దశాబ్దంపాటు పాలన సాగించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

సీఎం కప్‌ హ్యాండ్‌బాల్‌లో బంగారు పతకం

సీఎం కప్‌ హ్యాండ్‌బాల్‌లో బంగారు పతకం

సీఎం కప్‌ రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్‌ హ్యాండ్‌ బాల్‌ జిల్లా జట్టుకు సోమవారం మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 27 నుంచి 29 వరకు హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించారు.

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల నిరసన

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల నిరసన

సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగు లు చేపట్టిన సమ్మె సోమవారం 21వ రోజుకు చేరుకుంది. బుర్రకథను చెబు తూ ఉద్యోగులు విసూత్న నిరసన వ్యక్తం చేశారు. తాము చేస్తున్న విద్యా విధానంలో సేవా కార్యక్రమాలు, అదే విధంగా తాము ఎదుర్కొంటున్న సమ స్యలను వివరిస్తూ బుర్ర కథ రూపంలో వివరించారు.

అమిత్‌షా దిష్టిబొమ్మ దహనం

అమిత్‌షా దిష్టిబొమ్మ దహనం

అంబేద్కర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఐబీ చౌరస్తా లో సోమవారం వామపక్ష పార్టీల నాయకులు అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు.

సంక్షేమంలో సాటి... లాభాల్లో మేటి

సంక్షేమంలో సాటి... లాభాల్లో మేటి

సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం... లాభాల లక్ష్య సాధనలో కృషి చేస్తోంది... ఉద్యోగావకాశాలు, పర్యావరణ పరిరక్షణ, వైద్య సదుపాయాలు కల్పిస్తోంది... నూతన విద్యుత్‌ ప్రాజెక్టుల వైపు దూసుకెళ్తోంది... అయితే గతేడాది కంటే ఈసారి బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడింది.

కమ్యూనిస్టు పార్టీది త్యాగాల చరిత్ర

కమ్యూనిస్టు పార్టీది త్యాగాల చరిత్ర

భారత కమ్యూనిస్టు పార్టీది త్యాగాల చరిత్ర అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌ అన్నారు. సీపీఐ ఆవిర్భవించి శత వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా శ్రీరాంపూర్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించారు.

చప్రాలకు ప్రారంభమైన భక్తుల పాదయాత్ర

చప్రాలకు ప్రారంభమైన భక్తుల పాదయాత్ర

మంచిర్యాలోని ఐబీ చౌరస్తాలో గల భక్తాంజనేయ స్వామి దేవాలయం నుంచి ఆదివారం దత్తావతార కార్తీక్‌ మహారాజ్‌ చప్రాడ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర రెబ్బెన, టోంకిని మీదుగా ఈ నెల31న సాయంత్రం మహారాష్ట్రలోని హనుమాన్‌ మందిర్‌ ప్రశాంత్‌ధాం వరకు సాగనుందని భక్తులు తెలిపారు.

ఓపెన్‌ స్కూల్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

ఓపెన్‌ స్కూల్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

ఓపెన్‌స్కూల్‌ తరగతులను సద్విని యోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ ఎన్‌.అశోక్‌ అన్నారు. దండేపల్లి ఉన్నత పాఠశాలలో తరగతులను ఆదివారం పరిశీలిం చారు. ఆయన మాట్లాడుతూ ఓపెన్‌ స్కూల్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు రెగ్యులర్‌ పది, ఇంటర్‌తో సమానమన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందవచ్చనన్నారు.

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరింది. కలెక్టరేట్‌ ఎదుట శిబిరంలో ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాస్క్‌ ధరించగా, మహిళా ఉద్యోగులు వారికి రాఖీలు కట్టారు.

పెరుగుతున్న నేరాలు

పెరుగుతున్న నేరాలు

జిల్లాలో క్రైం రేట్‌ వేగంగా పెరుగుతోంది. పోలీస్‌శాఖ అసాంఘిక కార్యకలాపాలను అణిచివేస్తున్నప్పటికీ చాపకింద నీరులా పెరిగిపోతూనే ఉండటం సర్వత్రా ఆందోళనను కలిగిస్తోంది. జిల్లాలో వ్యభిచారం, జూదం నిత్యకృత్యం కాగా గంజాయి వినియోగం, నకిలీ విత్తనాల సరఫరా విస్తరిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి