• Home » Mancherial district

Mancherial district

జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు

జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు

కుటుంబ సమస్యలు... ఆర్థిక ఇబ్బందులు... అనారోగ్య సమస్యలు... ప్రేమ విఫలమైందని...స్టాక్‌ మార్కెట్‌లో నష్టం వచ్చిందని.. ఇలా రకరకాల కారణాలతో మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విలువైన జీవితాలను విషాదంగా ముగిస్తున్నారు.. సమస్య ఏదైనా చావే పరిష్కారమని ఆలోచిస్తూ నెల రోజుల వ్యవధిలో 20 మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

ఆహార నాణ్యతలో విద్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి యాదయ్య ఆదేశించారు. శుక్రవారం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి వంటశాల గదులు, కూరగాయల నిల్వ వంట సామగ్రిని పరిశీలించారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి

జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం ముల్కల్ల, గుడిపేట గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు.

గ్రూప్‌ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి

గ్రూప్‌ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి

గ్రూప్‌ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, డీసీపీ భాస్కర్‌, అదనపు డీసీపీ రాజులతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఆరోగ్య కార్యక్రమాల అమలు లక్ష్యాలను పూర్తి చేయాలి

ఆరోగ్య కార్యక్రమాల అమలు లక్ష్యాలను పూర్తి చేయాలి

జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు లక్ష్యాలను పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌ సూచించారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్‌ ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని, వాటి వివరాలను రెండు రోజుల్లో తెలియజేయాలని సూచించారు.

వామ్మో చలి...!

వామ్మో చలి...!

జిల్లాలో రెండు రోజులుగా చలి విజృంభిస్తోంది. మూడు రోజుల నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మరింతగా చలి పెరుగుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతు న్నారు. ముఖ్యంగా రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.

కోనంపేట రోడ్డు నిర్మాణానికి అడ్డు చెప్పొద్దు

కోనంపేట రోడ్డు నిర్మాణానికి అడ్డు చెప్పొద్దు

నెన్నెల-కోనం పేట రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఉన్న ప్పటికీ అధికారులు పనులు నిలిపి వేయడంపై కోనం పేట గ్రామస్థులు మండిపడ్డారు. కుంటిసాకులతో రోడ్డు పనులకు అడ్డు చెప్పొద్దంటూ నెన్నెల రేంజ్‌ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులను గుర్తించాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులను గుర్తించాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులను గుర్తిం చాలని హౌజింగ్‌ డీఈ మునీందర్‌ అన్నారు. గురువారం ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరి శీలించి మాట్లాడుతూ సర్వేను పారదర్శకంగా నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలన్నారు.

పోలింగ్‌ కేంద్రాలపై అభ్యంతరాలుంటే తెలుపాలి

పోలింగ్‌ కేంద్రాలపై అభ్యంతరాలుంటే తెలుపాలి

డ్రాఫ్ట్‌ పోలింగ్‌ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని ఎంపీడీవో సత్యనారా యణసింగ్‌ అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ కేంద్రాల జాబితాను విడుదల చేశామన్నారు.

ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తాం

ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తాం

నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సమస్యలను కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, సబ్‌ కమిటీ దృష్టికి తీసుకువెళ్తామని కేంద్ర సంఘం సలహాదారు సంద అశోక్‌ తెలిపారు. గురువారం జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఐటీఐ కార్యాలయంలో చేపట్టిన సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి