Home » Mahesh Kumar Goud
టీపీసీసీ కొత్త కార్యవర్గ నియామకం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం రెండు, మూడు రోజుల్లో నూతన కమిటీని ప్రకటించే అవకాశముంది.
Mahesh Kumar Goud: మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల భూములను కబ్జా చేశారని ఈటలపై కేసు నమోదు అయిందని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు తమ ప్రభుత్వం పడిపోతుందో ఈటల చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
కులగణన, ఎస్సీ వర్గీకరణ రెండూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సాధించిన గొప్ప విజయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు.
Telangana Congress: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోంది. బూత్, గ్రామ, మండల స్థాయి కమిటీలతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ ఉభయ సభలు చేసిన బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు కాంగ్రెస్ బీసీ వర్గం నేతలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
జనాభా లెక్కలతో పాటే కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించడంపై పలువురు రాజకీయ నేతలు, బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. అది విస్కీ బాటిళ్ల మీటింగ్. ఆ సభలో జనం కంటే విస్కీ బాటిళ్లే ఎక్కువగా కనిపించాయి. అందుకే ఆ సభకు మహిళలు పెద్దగా రాలేదు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.
Mahesh Goud: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొత్తుని కేసీఆర్ కుటుంబం అన్నిరంగాల్లో దోచుకుందని మహేష్‌కుమార్ గౌడ్ ఆరోపించారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ లిక్కర్ దందాలు చేసే కవితకు, త్యాగాల కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ పేరెత్తే నైతిక అర్హత లేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉండడంపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ప్రజలే కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని.. ప్రజలు కేంద్రంగానే పరిపాలన సాగి స్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. భారత్ సదస్సులో ఆయన మాట్లాడారు.