Home » Maharashtra
Kunal Kamra row: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా షో సందర్భంగా డిప్యూటీ సీఎంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. అతడు షో జరిగిన హోటళ్లో అధికార పార్టీ నేతలు విధ్వంసం సృష్టించారు. ఈ దాడికి నేతృత్వం వహించిన అధికార పార్టీ నేత రాహుల్ కునాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
కునాల్ కమ్రా షో జరిగిన హోటల్‌పై దాడిలో తమ పార్టీ కార్యకర్తల ప్రమేయం లేదని ఉద్ధవ్ థాకరే వివరణ ఇచ్చారు. అది 'గద్దర్ సేన' పని అని, ద్రోహం (గద్దర్) ఎవరి రక్తంలో ఉందో వాళ్లు ఎప్పుడూ శివసైనికులు కాలేరని అన్నారు.
నిజమైన శివసేన నేత ఎవరో 2024లో ప్రజలే నిర్ణయించారని, దోశద్రోహి ఎవరో, ఆత్మగౌరవం కలవారెవరో ప్రజలు నిర్ణయించిన విషయాన్ని కమ్రా తెలుసుకోవాలని ఫడ్నవిస్ అన్నారు. బాలాసాహెబ్ థాకరే వారసత్వాన్ని షిండే ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు.
Nagpur Riots Latest Update: నాగ్‌పూర్ అల్లర్లలో కీలక నిందితుడైన షాహిమ్ ఖాన్ విషయంలో యాక్షన్‌కు దిగింది మహా సర్కార్. ఖాన్ అక్రమనిర్మాణాలపై చర్యలు చేపట్టింది.
హింసకు కారణమైన వారి నుంచి ఆస్తి నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని, వారు డబ్బులు చెల్లించని పక్షంలో వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయిస్తామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.
నాగపూర్ హింసాకాండ ఘటలో ఇంతవరకూ పోలీసులు 50 మందిని అరెస్టు చేశారు. నాగపూర్‌లోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా రెండవ రోజైన బుధవారంనాడు కూడా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు.
నాగపూర్ హింస, ఔరంగబేజు సమాధి వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ రకమైన హింస సమాజానికి మంచిది కాదని ఆర్ఎస్ఎస్ కీలక నేత సునీల్ అంబేకర్ అన్నారు.
తమ గడ్డపై ఒసామాబిన్ లాడెన్‌ను పూడ్చిపెట్టేందుకు అమెరికా నిరాకరించిందని, అతని మృతదేహాన్ని సముద్రంలో గుర్తుతెలియని ప్రాంతంలో డిస్పోజ్ చేసిందని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. తద్వారా లాడెన్‌ను ఎవరూ కీర్తించకుండా అడ్డుకట్ట వేసిందని అన్నారు.
ఔరంగజేబు సమాధి తొలగించాలన్న డిమాండ్స్ హింసాత్మకంగా మారడంతో నాగ్‌పూర్ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు.
ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్స్ నాగ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాళ్ల దాడి, వాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు వెలుగు చూడంతో పోలీసుల భాష్ప వాయువు ప్రయోగించి అల్లరి మూకలను చెదరగొట్టాల్సి వచ్చింది. ప్రజలు ఎటువంటి వదంతులను నమ్మొద్దని మహారాష్ట్ర సీఎం పిలుపునిచ్చారు.