Share News

Nagpur Ippa Gang: గ్యాంగ్ లీడర్ భార్యతో ఎఫైర్.. వెంటాడి చంపేశారు..

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:34 PM

Nagpur Ippa Gang: తన భార్య చావుకు అర్షద్ కారణమని గ్యాంగ్ లీడర్ భావించాడు. అతడ్ని చంపి పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గ్యాంగ్ మొత్తం అర్షద్‌కు వ్యతిరేకంగా మారింది.

Nagpur Ippa Gang: గ్యాంగ్ లీడర్ భార్యతో ఎఫైర్.. వెంటాడి చంపేశారు..
Nagpur Ippa Gang:

గ్యాంగ్ లీడర్ భార్యతో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి కొంపముంచింది. ఆమె మరణం అతడి చావుకు వచ్చింది. 40 మంది ఉన్న ఆ గ్యాంగ్ అతడి కోసం వెంటాడుతోంది. ప్రాణ భయంతో ఆ వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఇప్ప గ్యాంగ్‌కు పోలీసు రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌గా పేరుంది. ఆర్షద్ టోపి అనే వ్యక్తి ఆ గ్యాంగులో సభ్యుడిగా ఉన్నాడు. అతడు ఏకంగా ఆ గ్యాంగ్ లీడర్ భార్యతో సంబంధం పెట్టుకున్నాడు.


ఇద్దరూ తరచుగా ఏకాంతంగా కలుస్తూ ఉండేవారు. బయట తిరుగుతూ ఉండేవారు. గురువారం ఇద్దరూ బైకు మీద బయటకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వారు ప్రయాణిస్తున్న బైకు యాక్సిడెంట్‌కు గురైంది. గ్యాంగ్ లీడర్ భార్య తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అర్షద్ మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. భార్య చనిపోవటంతో ఇప్ప గ్యాంగ్ లీడర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన భార్యకు, అర్షద్‌కు సంబంధం ఉందని తెలియటంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.


తన భార్య చావుకు అర్షద్ కారణమని గ్యాంగ్ లీడర్ భావించాడు. అతడ్ని చంపి పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గ్యాంగ్ మొత్తం అర్షద్‌కు వ్యతిరేకంగా మారింది. అతడ్ని వెతికిపట్టుకుని చంపాలని డిసైడ్ అయింది. ఇప్ప గ్యాంగ్ అర్షద్ కోసం గాలిస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలియటంతో అర్షద్ డీసీపీ ఆఫీస్‌కు వెళ్లాడు. పోలీసులు అతడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. పోలీసులను కలిసిన తర్వాత అర్షద్ అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. ఇప్ప గ్యాంగ్ అతడ్ని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.


ఇవి కూడా చదవండి

వృద్ధుడి బంపర్ ఆఫర్.. పిల్లిని చూసుకుంటే కోట్ల ఆస్తి మీదే..

తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి? ఉపవాసం ఎందుకు చేస్తారు?

Updated Date - Jul 06 , 2025 | 01:17 PM