Wife And Lover: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:32 AM
Wife And Lover: భర్త బతికి ఉంటే తమ సంబంధానికి అడ్డుగా ఉంటాడని వారు భావించారు. ఈ నేపథ్యంలోనే చంద్రశేఖరన్ హత్యకు ప్లాన్ చేశారు. శుక్రవారం రాత్రి మంచంపై పడున్న అతడి చేతుల్ని దిశ పట్టుకుంది. రాజాబాబు గొంతు నులిమి చంపేశాడు.
అక్రమ సంబంధాలకు నిండు జీవితాలు బలి అవుతున్నాయి. ప్రియుళ్లతో కలిసి భర్తలను చంపుతున్న భార్యల ఘటనలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు ప్రతీ నిత్యం కనీసం ఒక సంఘటన అయినా వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. సదరు భార్య.. మంచానికి పరిమితమైన తన భర్త చేతుల్ని పట్టుకుంటే.. ప్రియుడు అతడి గొంతు నులిమి చంపేశాడు. చివరకు పాపం పండి భార్య, ప్రియుడు జైలు పాలయ్యారు.
ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. 38 ఏళ్ల చంద్రశేఖరన్ రామ్‌తేకే, దిశ భార్యాభర్తలు. చంద్రశేఖరన్ అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే దిశ అదే ప్రాంతానికి చెందిన ఆసిఫ్ అలియాస్ రాజాబాబుతో సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ తరచుగా కలుస్తూ ఉండేవారు. వీరిద్దరి సంబంధం విషయం తాజాగా చంద్రశేఖరన్‌కు తెలిసింది.
అది కాస్తా కుటుంంబంలో పెద్ద గొడవకు దారి తీసింది. అయితే, భర్త బతికి ఉంటే తమ సంబంధానికి అడ్డుగా ఉంటాడని వారు భావించారు. ఈ నేపథ్యంలోనే చంద్రశేఖరన్ హత్యకు ప్లాన్ చేశారు. శుక్రవారం రాత్రి మంచంపై పడున్న అతడి చేతుల్ని దిశ పట్టుకుంది. రాజాబాబు గొంతు నులిమి చంపేశాడు. అనారోగ్యం కారణంగా భర్త చనిపోయాడని దిశ ప్రచారం చేసింది. అయితే, చంద్రశేఖరన్ కుటుంబసభ్యులు ఆమె మాటలు నమ్మలేదు.
పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో చంద్రశేఖరన్ ఊపిరి ఆడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు దిశను అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు విషయం బయటపడింది. దిశతో పాటు ఆమె ప్రియుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రేమ పెళ్లి.. ప్రతీ రోజూ గొడవలే.. కట్ చేస్తే..
డాక్టర్లు చేయలేని పని చాట్ జీపీటీ చేసింది..