Home » Kuwait
పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లి.. భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకునేందుకు రేయింబవళ్లు కష్టపడి పనిచేసే ఆ కార్మికుల ఊపిరి ఆగిపోయింది. కాయకష్టం చేసి, ఆదమరిచి
కువైట్ లో సంభవించిన భారీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తక్షణ చర్యలకు దిగారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వెంటనే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ను ఆదేశించారు.
దక్షిణ కువైట్ లోని మంగాఫ్ నగరంలో బుధవారం తెల్లవారు జామున 6 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో 41 మంది సజీవదహనమయ్యారు.
తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దత్తుగా కువైట్‌లో ఎన్నారైలు విస్తృత ప్రచారాన్ని చేపట్టారు.
ఎన్నారై తెలుగుదేశం కువైట్, జనసేన కువైట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు.
కువైట్ పాలక ఎమిర్ (నోబెల్ టైటిల్) షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా (86) కన్ను మూశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ మీడియా శనివారం స్పష్టం చేసింది. గత నెలలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన..
ప్రవాసులకు కువైత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వలసదారులకు (Expats) ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కేంద్రాల పనివేళలు పొడిగిస్తూ ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ (Ministry of Health) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-సనద్ తాజాగా కీలక ప్రకటన చేశారు.
గల్ఫ్ దేశం కువైత్ ఫ్యామిలీ వీసాలు జారీ చేసే యోచనలో ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే అంతర్గత మంత్రిత్వశాఖ ఆర్టికల్ 22 (ఫ్యామిలీ లేదా డిపెండెంట్ వీసా) ప్రకారం ఇచ్చే ఈ వీసాల సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
గత కొంతకాలంగా ప్రవాసుల (Expatriates) పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశం కువైత్ తాజాగా మరో కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. వలసదారుల రెసిడెన్సీ చట్టాన్ని (Expats Residency Law) సవరించే బిల్లును పార్లమెంటరీ ఇంటీరియర్, డిఫెన్స్ అఫైర్స్ కమిటీ ఆమోదించింది.
కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల (Indian students) కు 'ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైత్' (Indian Community School Kuwait) గుడ్‌న్యూస్ చెప్పింది. మనోళ్ల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2023 నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫెయిర్ ఈ నెల 8, 9వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు (కువైత్ కాలమానం ప్రకారం) ఉంటుంది.