• Home » KonaSeema

KonaSeema

సహకార ఎన్నికలకు కసరత్తు

సహకార ఎన్నికలకు కసరత్తు

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు త్రిసభ్య కమిటీలు ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో కూటమి నాయకులలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 166 వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉండటంతో వీటిలో ముగ్గురు సభ్యులను నియమించి పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో పాలక వర్గాలను దక్కించుకోవడం కోసం నియోజకవర్గ శాసన సభ్యుల వద్దకు ఆశావహులు పరుగులు తీస్తున్నారు.

 త్వరలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

త్వరలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

విద్యార్థి దశ నుంచి పరిశోధనా శక్తిని పెంపొందించడంతో పాటు వారిని ప్రోత్సహించే లక్ష్యంతో త్వరలోనే జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీంబాషా తెలిపారు. ఈ నెల 29వ తేదీలోగా మండలస్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు పూర్తి చేయాలని బుధవారం ఆదేశించారు.

మున్సిపాలిటీలకు మహర్దశ

మున్సిపాలిటీలకు మహర్దశ

మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. ఇం దుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మున్సిపాలిటీల నిధులను సొంత ఖర్చు లకే వినియోగించుకునే వెసులుబాటును కూట మి ప్రభుత్వం కల్పించింది.

గోదాములపై ఉక్కుపాదం

గోదాములపై ఉక్కుపాదం

కాకినాడ జిల్లా కరప మండలం కొరి పల్లి అద్దె గోదాములో రేషన్‌ బియ్యం మా యంపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. అన్ని ప్రైవేటు గోదాముల్లో నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యంపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదే శించింది. కాకినాడ జిల్లాలో ఎనిమిది గోదా ములను పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసు కుని రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని నిల్వ చేసింది.

 స్టెల్లాఎల్‌ నౌకకు అన్నీ అవాంతరాలే!

స్టెల్లాఎల్‌ నౌకకు అన్నీ అవాంతరాలే!

కాకినాడ సముద్రంలో లంగరు వేసు కుని ఉన్న స్టెల్లా ఎల్‌ పనామా నౌకకు అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి. వాతావర ణం అనుకూలించకపోవడం వల్ల నౌకలోని రేషన్‌ బియ్యం ఒడ్డుకు చేర్చలేకపోతున్నారు. దీంతో నౌక గమ్యం చేరే పరిస్థితి చేరడం లేదు. మంగళవారం కూడా తుఫాను ప్రభా వంతో బియ్యాన్ని తీసుకురాలేకపోయారు. స్టెల్లాఎల్‌ పనామా నౌక కాకినాడ సముద్ర తీరానికి వచ్చి దాదాపు నెల రోజులవుతోంది.

తవ్వుకో..దోచుకో..

తవ్వుకో..దోచుకో..

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్న ఉచిత ఇసుక పథకం లక్ష్యం క్షేత్రస్థాయిలో నీరుగారిపోతోంది. ఇప్పటికే ఆత్రేయపురం మండలంలో అంకంపాలెం, నార్కెడిమిల్లి, పులిదిండి వద్దిపర్రు, ఆత్రేయపురం ఇసుక ర్యాంపులను ప్రారంభించడమే కాకుండా మరో మూడు ర్యాంపులను అధికారులు మంజూరు చేయనున్నారు.

 మూడు ర్యాంపులకు టెండర్లు

మూడు ర్యాంపులకు టెండర్లు

జిల్లాలో మూడు ఇసుక రీచ్‌లకు జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ టెండరు నోటిఫికేషన్‌జారీ చేశారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మూడు కీలకమైన ఇసుక ర్యాంపుల్లో తవ్వకాలు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌, స్టోరేజ్‌ పాయింట్‌ వద్ద ఇసుక నిల్వ చేసేందుకు టెండర్లు పిలిచారు. అయితే ఈ షార్ట్‌ టెండర్ల నోటీసులో అధికారులు విధించిన నిబంధనల పట్ల కాంట్రాక్టర్ల నుంచి నిరసనలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ర్యాంపులు నిర్వహించిన కాంట్రాక్టర్లకే అనుకూలంగా ఉండే విధంగా నిబంధనలు రూపొందించడం పట్ల పలువురు ఆరోపణాస్ర్తాలు సంధిస్తున్నారు.

రోడ్ల అభివృద్ధి చర్యలు

రోడ్ల అభివృద్ధి చర్యలు

పూర్వపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పీపీపీ విధానంలో రోడ్లు అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు చెప్పారు. కార్లపై ప్రయాణించే వారి నుంచి మాత్రమే టోల్‌ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వాహనాలకు టోల్‌ ఫీజు ఉండదని స్పష్టం చేశారు. అమలాపురం అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటీకి సంబంధించిన ప్రతిపాదనలు క్రోడీకరించి సమర్పిస్తే వాటి మంజూరు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

జిల్లా పోలీసు అధికారులకు ఏబీసీడీ అవార్డులు

జిల్లా పోలీసు అధికారులకు ఏబీసీడీ అవార్డులు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా కేసును విజయవంతంగా ఛేదించిన జిల్లాకు చెందిన పోలీసు అధికారులకు ఏపీ రాష్ట్ర పోలీసు ఏబీసీడీ అవార్డులను రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అందజేశారు. అమలాపురం తాలూకా పోలీసు స్టేషన్‌ పరిధిలోని క్రైమ్‌ నంబరు 181/2024లో నిందితులుగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా కేసును ఇటీవల జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు నేతృత్వంలో ప్రత్యేక బృందం అరెస్టు చేసింది.

 కోనసీమ సర్వతోముఖాభివృద్ధికి సహకారమందిస్తా

కోనసీమ సర్వతోముఖాభివృద్ధికి సహకారమందిస్తా

ప్రకృతి అందాలతో పరవశింపజేసే కోనసీమ జిల్లా అన్ని రంగాల్లోను సర్వతోముఖాభివృద్ధి సాధించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గల గోదావరి భవన్‌లో బుధవారం సాయంత్రం జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి