Share News

ఒకరోజు ముందుగానే పింఛన్లు

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:14 AM

గతంలో ఎన్నడూలేని విధంగా మళ్లీ మరోసారి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1 బుధవారం అయినప్పటికీ నూతన సంవత్సరంలో ఆనందోత్సాహాలతో పెన్షన్‌దారులు గడపాలన్న లక్ష్యంతో ఒకరోజు ముందుగానే డిసెంబరు 31న పెన్షన్ల పంపిణీకి ఆదేశాలు జారీ చేసినట్టు డీఆర్డీఏ పీడీ డాక్టర్‌ వి.శివశంకరప్రసాద్‌ తెలిపారు.

 ఒకరోజు ముందుగానే పింఛన్లు

అమలాపురం టౌన్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూలేని విధంగా మళ్లీ మరోసారి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1 బుధవారం అయినప్పటికీ నూతన సంవత్సరంలో ఆనందోత్సాహాలతో పెన్షన్‌దారులు గడపాలన్న లక్ష్యంతో ఒకరోజు ముందుగానే డిసెంబరు 31న పెన్షన్ల పంపిణీకి ఆదేశాలు జారీ చేసినట్టు డీఆర్డీఏ పీడీ డాక్టర్‌ వి.శివశంకరప్రసాద్‌ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో 2,38,012 మంది లబ్ధిదారులకు రూ.100.04 కోట్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. జిల్లాలో అత్యధికంగా అమలాపురం రూరల్‌ మండలంలో 12,129 మంది పెన్షన్‌దారులకు రూ.5.03 కోట్లు అత్యల్పంగా ముమ్మిడివరం నగర పాలక సంస్థలో 3,029 మంది పెన్షన్‌దారులకు రూ.1.29 కోట్లు పెన్షన్లగా అందించనున్నారు. 31వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసేందుకుగాను ముందుగానే 30వ తేదీన బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకునే విధంగా ఆయా పంచాయతీల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

Updated Date - Dec 27 , 2024 | 12:14 AM