విజయదుర్గా పీఠంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:15 AM
మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో పవిత్రోత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయదుర్గా అమ్మవారికి, శ్రీదేవి , భూదేవి సమేత విజయవేంకటేశ్వరస్వామికి వైఖానస పండితులు పూజలు నిర్వహించారు.
రాయవరం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో పవిత్రోత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయదుర్గా అమ్మవారికి, శ్రీదేవి , భూదేవి సమేత విజయవేంకటేశ్వరస్వామికి వైఖానస పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేసి హోమాలు జరిపారు. పవిత్రోత్సవాల విశిష్టతను వేదపండితులు భక్తులకు వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, విజయదుర్గా సేవాసమితి ప్రతినిధులు గాదే భాస్కరనారాయణ, సత్య వెంకటకామేశ్వరి, పెద్దపాటి సత్యకనకదుర్గ, బలిజేపల్లి రమ, పీఆర్వో బాబి పాల్గొన్నారు.