ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరపాలి
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:57 PM
సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల తీర్థాన్ని సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు సూచించారు. అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి శ్యామలాంబ సమేత శ్రీ చెన్నమల్లేశ్వరస్వామి ఆలయంలో 11 ప్రభల ఉత్సవ కమిటీ సమావేశం శ్రీపాద వెంకటరమణ అధ్యక్షతన బుధవారం జరిగింది.
అమలాపురం రూరల్, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల తీర్థాన్ని సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు సూచించారు. అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి శ్యామలాంబ సమేత శ్రీ చెన్నమల్లేశ్వరస్వామి ఆలయంలో 11 ప్రభల ఉత్సవ కమిటీ సమావేశం శ్రీపాద వెంకటరమణ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఉత్సవంలో ఎటువంటి అల్లర్లకు పాల్పడకుండా ఆయా గ్రామాల పెద్దలు జాగ్రత్తలు వహించాలన్నారు. ఏకాదశ రుద్రుల ఆలయాలకు భక్తులు అధికంగా వస్తున్న దృష్ట్యా జగ్గన్నతోటలో జరిగే ప్రభల ఉత్సవానికి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసే విధంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రాన్ని అందచేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో సర్పంచ్ దొంగ నాగేశ్వరరావు, చిఠావఝుల సూర్యారావు, ముదునూరి చంటిరాజు, ఎం.ఎం.శెట్టి, బులుసు సుబ్రహ్మణ్య వ్యాఘ్రిశ్రీనివాస్, కట్టా సుబ్రహ్మణ్యం, పుల్లేటికుర్తి సత్తిబాబు, మట్టపర్తి రెడ్డమ్మ, జె.సాయిరాం, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.