Home » Kollu Ravindra
జగన్మోహన్ రెడ్డి మీద సిట్ విచారణ పెరుగుతోందని, ఆయనపై లిక్కర్ స్కాంలు, మైనింగ్ దోపిడీ, రేషన్ బియ్యం దొంగతనం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర ఈ అవినీతులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ ప్రభుత్వంపై మద్యం నగదు లావాదేవీలపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం కేసులో టీడీపీని ఫోకస్ చేస్తూ వైసీపీని దోపిడీ దోషిగా నిలదీసారు.
మద్యం కుంభకోణంలో విచారణ వేగవంతంగా జరుగుతుందని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. జగన్ ప్రజల ఆరోగ్యాన్ని పశ్చాత్తాపం చేయడమే కాక, అక్రమ సంపాదన కోసం అమాయకులని నాశనం చేశాడని ఆయన ఆరోపించారు
Amravati Capital Reconstruction: మే 2న జరిగే అమరావతి నిర్మాణ పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని మంత్రులు తెలిపారు. జగన్ మూడు రాజధానుల పేరుతో అమరావతిపై కుట్రలు చేశారని మండిపడ్డారు.
మచిలీపట్నం పోర్టు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా మచిలీపట్నంలో ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయని మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మరోవైపు బందరులో టూరిజం హబ్ ఏర్పాటు పనులు చేస్తున్నామని, సర్క్యూట్ టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు తెలిపారు.
Kollu Ravindra Warn: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణంపై మంత్రి కొల్లురవీంద్ర స్పందించారు. మద్యం స్కాంలో బాగోతాలన్నీ బయటకొస్తున్నాయని తెలిపారు.
గనుల శాఖపై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో, మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీగా నియమించిన పి. రాజాబాబును సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వం తొలగించింది. ఆయనపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నా, మంత్రి పట్టుబడి నియమించగా.. ఇప్పుడు అవే ఆరోపణలు అధికారుల వైఖరిని ప్రశ్నించాయి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్.. ఆ మాటలేంటి.. అంటూ వ్యాఖ్యానించారు. పోలీసులను బట్టలూడదీసి కొడతానని అనడంపై ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇవేనా అంటూ ప్రశ్నించారు.
బెల్టు షాపుల మీద ఉక్కు పాదం మోపుతున్నామని, బెల్టు షాపు అనుబంధంగా ఉన్న షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హత్యలు, అక్రమ కేసులతో రెచ్చిపోయారని, 44 రోజుల పాటు తాను కూడా రాజమండ్రి జైల్లో ఉన్నానని చెప్పారు.
ఆగస్టు తరువాత నాటు సారా కనిపించకూడదనే లక్ష్యంతో మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాను ఆదర్శంగా తీసుకుని గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు