Home » Kodali Nani
రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుని సీఎం జగన్‌ని ఢీ కొట్టాలని చూసినా నిరూపయోగమేనని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani)అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఛాలెంజ్‌కు కొడాలి కౌంటర్ ఇచ్చారు.
Kodali Nani Vs YS Jagan: గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) చెక్ పెడుతున్నారా..? నమ్మినబంటు, తనకోసం ప్రాణాలిచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం.. ఇప్పుడు ఆయన్నే పక్కనెడుతున్నారా..? ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి కంచుకోట అయిన గుడివాడ (Gudivada) నుంచి టికెట్ ఇవ్వలేనని తేల్చి చెప్పేశారా..? ఇందుకు ఇటీవల జరిగిన ఒకట్రెండు పరిణామాలే బలం చేకూరుస్తున్నాయా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది..
కల్లు తాగిన కోతిలా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వాగుతున్నారని జనసేన నేత పోతిన మహేష్ (Potina Mahesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారంటూ ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు విసిరారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ హై కమాండ్‌పై అసంతృప్త నేతలు వరుసగా తిరుగుబాపుటా ఎగురవేస్తున్నారు.
Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ప్రాపకం కోసం పాకులాడడం సరికాదన్నారు.
గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) వ్యవహారంతో విసిగిపోయిన ఆయన అనుచరులు తమకు టచ్‌లో ఉన్నారని గుడివాడ టీడీపీ ఇన్‌చార్జ్ వెనిగండ్ల రాము (Venigandla Ramu) అన్నారు. గురువారం నాడు రాము ఆధ్వర్యంలో గుడివాడలోని 28వ వార్డులో ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమం నిర్వహించారు.
Andhrapradesh: వైసీపీ ఎమ్మెల్యే కొడాలినానిపై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని ఒక బడుద్దాయి అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. గుడివాడలో ‘‘రా కదలిరా’’ బ్రహ్మాండంగా విజయవంతం అయ్యిందన్నారు. 5 వేల కుర్చీల కన్నా ఎక్కువ ఉంటే గుడివాడ వదిలిపెట్టి పారిపోతాను అని గుట్కా, క్యాసినో, గుండాట, సన్నాసి నాని మాట్లాడుతున్నారని టీడీపీ నేత దుయ్యబట్టారు.
రాబోయే ఎన్నికల్లో గుడివాడ వైసీపీ ( YCP ) ఎమ్మెల్యే కొడాలి నాని ( Kodali Nani ) కి డిపాజిట్ గల్లంతేనని తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని ( Kesineni Chinni ) అన్నారు.
కృష్ణా జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విధ్వంసం, అరాచకం వైసీపీ లక్ష్యమని దుయ్యబట్టారు.