Home » Khammam
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలలు, హాస్టళ్ల మెనూ ఛార్జీలను పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అదే పెద్దలు నేడు పాఠశాలలు సందర్శించి భోజనం బాగోలేదంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన దంపతులను వారింట్లో కిరాయికి ఉంటున్న వ్యక్తులే చంపేశారు. దంపతులు డబ్బున్నవారని తెలిసి..
ఇటీవలే చనిపోయిన విశ్రాంత ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ డబ్బులను ఆయన భార్యకు ఇప్పించేందుకు రూ.40వేలు లంచం అడిగిన సీనియర్ అకౌంటెంట్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, రైతు బిడ్డగా తనకు ఎంతో సంతృప్తిగా ఉందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతులకు ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఆ దిశగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత 5 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో ములుగులోని మేడారం కేంద్రంగా 3-7 సెకన్ల పాటు కొనసాగిన ప్రకంపనలతో కొన్ని చోట్ల ఇళ్ల గోడలు, నేల బీటలువారాయి.
ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీహర్షిత.. ఎంబీబీఎస్‌లో ఫ్రీ సీట్ సాధించారు. కానీ చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేక పోవడంతో ఆమె చదువు ఆపేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. చదువుల తల్లిని ఆదుకోమంటూ.. శ్రీహర్షిత దయనీయ కథనాన్ని ప్రసారం చేసింది.
ఇద్దరు కుమారులకు ఆస్తి పంపకానికి సంబంధించిన వివాదంలో ఖమ్మం నగరానికి చెందిన వ్యాపారవేత్త చేకూరి సత్యంబాబు(79) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున తన నివాసంలోనే విషం తీసుకొని చనిపోయారు. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాశారు.
ఆయిల్ పామ్ సాగుతో రైతన్నను రాజుగా మార్చడమే తన కలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు నష్టాల బారిన పడకుండా లాభాలు తెచ్చిపెట్టే పంట ఆయిల్ పామ్ అని తుమ్మల చెప్పారు.
ములుగు జిల్లా, వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండడంతో ఎస్ఐ మనస్థాపానికి గురయ్మారు. పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్‌తో కాల్చుకొని చనిపోయారు. దీంతో ఎస్ఐ హరీష్ స్వంత గ్రామం గొరికొత్తపల్లి మండలం, వెంకటేశ్వర్లుపల్లిలో విషాదం నెలకొంది.
ములుగు జిల్లా: వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ నిన్న (ఆదివారం) రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకుని ఉన్నారు. ఎవరు ఫోన్ చేసిన ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన ఆత్మహత్యకు ఇంట్లో కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణంగా సమాచారం. రిసార్ట్స్ సిబ్బంది ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు.