Home » Kejriwal
ఛత్తీస్‌గఢ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ వరాల జల్లులు కురిపించింది. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి వస్తే 10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసింది. పలు హామీలతో కూడిన గ్యారెంటీ కార్డును ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేశారు.
రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై ఉక్కుపాదం మోపుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం అసెంబ్లీలో..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జన్మదినోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆయురారోగ్య సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కేజ్రీవాల్ ఈ ఏడాది 55వ పడిలో అడుగు పెడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడూ నిప్పులు చెరిగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా..
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీలకు లేఖ రాశారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో తమకు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మంత్రివర్గ విస్తరణ చేశారు. ప్రజాపనుల శాఖ మంత్రి అతిషికి సర్వీసులు, విజెలెన్స్ శాఖలను అదనంగా అప్పగించారు. ఈ నియామకాలను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదానికి పంపారు.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు (Delhi Ordinance Bill) లోక్‌సభ (Loksabha), రాజ్యసభలో (Rajyasabha) ఆమోదం లభించింది. ఇక మిగిలిందల్లా రాష్ట్రపతి ఆమోదం మాత్రమే. రాష్ట్రపతి ఆమోదిస్తే ఆర్డినెన్స్ బిల్లు చట్టం కానుంది. త్వరలోనే ఈ బిల్లును రాష్ట్రపతికి కేంద్రం పంపనుంది. ఇంతవరకూ అంతా ఓకేగానీ తెలుగు రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ పక్షానికి ఓటేశాయి..?
అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో శుక్రవారం నిరాశ మిగిలింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం వైకాపా, బీజేడీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023 (GNTC)కు ఎందుకు మద్దతిస్తున్నారని నిలదీశారు. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు బదులుగా తీసుకొస్తున్న ఈ బిల్లుకు వైసీపీ, బీజేడీ ఎందుకు మద్దతిస్తున్నాయో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.
అత్యంత వివాదాస్పదమైన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు వచ్చే వారం పార్లమెంటుకు రాబోతోంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేసిన ప్రయత్నాలు ఎంత వరకు సత్ఫలితాలిస్తాయో తేలిపోబోతోంది. ఈ బిల్లుకు మద్దతిస్తామని వైసీపీ ఇప్పటికే ప్రకటించగా, దీనిని వ్యతిరేకిస్తామని బీఆర్ఎస్ తెలిపింది.