Home » Kejriwal
దిల్లీ మద్యం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) జారీ చేసిన ఆర్డర్స్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న ఈడీ.. కాగితాలు, కంప్యూటర్ ను తాము సమకూర్చలేదని, అవి ఆయనకు ఎలా వచ్చాయో చెప్పాలంటూ మంత్రి అతిశీని ప్రశ్నించింది.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Kejriwal ) సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఈడీ కస్టడి నుంచి తొలి ఆర్డర్స్ సైతం జారీ చేసేశారు.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్న తరుణంలో ఆప్ నేత అతిశీ కీలక ప్రకటన చేశారు. దిల్లీ మద్యం కేసులో తమ నాయకుడు కేజ్రీవాల్ ( Kejriwal ) ను అన్యాయంగా ఈడీ అరెస్టు చేసిందని ఆరోపించారు. ఈ కారణంగా తాము హోలీ ఆడలేకపోతున్నట్లు తెలిపారు.
లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఇండియా బ్లాక్ కూటమి ముక్తకంఠంతో ఖండించింది. అరెస్ట్‌ను నిరసిస్తూ ఈ నెల 31వ తేదీన ఆదివారం నాడు మెగా ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
మద్యం కుంభకోణంలో కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జలవనరుల శాఖకు జారీ చేశారు. ఇవాళ సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అతిషి సీఎం ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు.
దిల్లీ మద్యం కేసులో ఇటీవల అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ పై బీజేపీ మండిపడింది. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ( Kejriwal ) పడుతున్న బాధకు కేజ్రీవాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ హైకోర్టులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్, ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ శనివారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ వెంటనే విచారించాలని కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. అరెస్టు అయినప్పటికీ దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగడం నీచమైన రాజకీయం అని ఫైర్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్‌కు సపోర్ట్ గా నిలిచినందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర మంత్రి మండిపడ్డారు.
లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన తర్వాత ఆప్ నేతల నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ లక్ష్యంగా ఆప్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆప్ మంత్రులను అధికార నివాసాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.
లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈడీ విధించిన రిమాండ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. రిమాండ్ పిటిషన్‌ను ఆదివారం లోపు విచారించాలని కోరారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.