Home » Kamareddy
Telangana Elections: రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు కానీ.. రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి గంజ్, జేపీఎన్ రోడ్‌లోని ఇస్లాంపురలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.
Telangana Elections: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రానికి ముగియనుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం బంద్ కానుంది. ఈ క్రమంలో అన్ని పార్టీల అభ్యర్థులు చివరి రోజు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపనున్నారు.
కొడంగల్‌లో చెల్లని రూపాయి.. కామరెడ్డిలో గెలుస్తుందా?, రేవంత్ రెడ్డికి కామారెడ్డిలో 3వ స్థానమే. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో ఉద్యమాల గడ్డ కామారెడ్డిపై నీ కథలు సాగవు.
Telangana Elections: లీడర్లను కొనవచ్చు కానీ తమ ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనలేరని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మాట్లాడుతూ... రాహుల్, ప్రియాంకలు కర్ణాటకలో అయిదు హామీలు చెప్పారని.. అక్కడి ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. వారు అధికారంలోకి వచ్చాక ఉన్న కరెంటు పోయిందన్నారు.
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ( BRS party ) కి బిగ్ షాక్ తగిలింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల జెడ్పీటీసీ తిరుమలగౌడ్ ( Tirumala Goud ) ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఒకే కుటుంబం అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంది. కాళేశ్వరం ద్వారా జేబులు నింపుకున్నారు. మీ దృష్టి ఇసుక దందాలు, కాంట్రాక్టుల మీద ఉంది కానీ ప్రజా సంక్షేమం మీద లేదు. సర్కారు నడిపే పద్ధతి ఇది కాదు.. మంది సొమ్ము
CM KCR Vs Revanth Reddy : కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ సీఎం, గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిన కొద్దిరోజుల్లోనే..
Telangana Elections: ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం మధ్యాహ్నం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో కేసీఆర్ నామినేషన్ వేశారు. రెండు సెట్ల నామినేషన్‌లు కేసీఆర్ దాఖలు చేశారు.
‘‘నేను కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్లిన మీ గుండెల్లోనే ఉంటా’’ అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.