Share News

Kamareddy: అయ్యప్ప షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Dec 14 , 2023 | 12:13 PM

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిడ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్రాలు చేశారు.

Kamareddy: అయ్యప్ప షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిడ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్రాలు చేశారు. అయితే లోపలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైంది. మంటలు ఎగిసిపడుతుండడంతో అయ్యప్ప షాపింగ్ మాల్ ప్రక్కన ఉన్న ప్రైవేట్ అసుపత్రిని అదికారులు ఖాళీ చేయించారు. పోలీస్, అగ్నిమాపక, రెవిన్యూ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్‌తో జరిగిందా? లేక ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Dec 14 , 2023 | 12:13 PM