Home » Kamal Haasan
లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు మక్కల్ నీది మయ్యం కట్చి అధ్యక్షుడు కమలహాసన్(Kamala Haasan) మద్దతు తెలియజేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విచారం వ్యక్తం చేశారు.
ఏ కూటమిలో చేరినా ఓటమి ఖాయమనే భయంతోనే మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమలహాసన్(Kamala Haasan) అవినీతి అక్రమాలకు నెలవైన డీఎంకే కూటమిలో చేరి ఆ పార్టీ అవినీతికి గట్టి మద్దతు ప్రకటించారని కేంద్రమంత్రి ఎల్.మురుగన్(Union Minister L. Murugan) విమర్శించారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని (Citizenship Amendment Act) అమల్లోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం మీద సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) (Makkal Needhi Maiam) పార్టీ చీఫ్ కమల్ హాసన్ (Kamal Haasan) నిప్పులు చెరిగారు. దేశాన్ని విభజించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Govt) ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రముఖ సినీ నటుడు కమలహాసన్(Kamala Haasan) నాయకత్వంలోని మక్కల్ నీదిమయ్యం పార్టీ డీఎంకే కూటమిలో స్థానం మాత్రమే సంపాదించుకుంది.
లోక్‌సభ ఎన్నికల వేళ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని అధికార డీఎంకే సారథ్యంలోని కూటమిలో కమల్ పార్టీ 'మక్కల్ నీథి మయ్యం' శనివారంనాడు చేరింది.
లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియక మక్కల్ నీదిమయ్యం నేత కమలహాసన్(Kamala Haasan) అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్‌ఎం) డీఎంకే కూటమిలో చేరటం ఖాయమే అయినా సీట్ల పంపకంపై ఇరు పార్టీల నడుమ ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ఇండియా కూటమి(INDIA Bloc)లో చేరికపై నటుడు, మక్కల్ నీధి మయ్యమ్(MNM) అధ్యక్షుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎన్ఎం 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన చెన్నైలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఇండియా కూటమిలో తన పార్టీ లేదని వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమితో పొత్తుకుదుర్చుకోవాలనే విషయమై రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు కమలహాసన్(Kamala Haasan) తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై రెండ్రోజుల్లో ప్రకటన చేస్తామని ప్రముఖ నటుడు, మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధత, పొత్తులపై చెన్నై విమానాశ్రయంలో మీడియాతో సోమవారంనాడు ఆయన మాట్లాడారు. ఇదొక మంచి అవకాశమని వ్యాఖ్యానించారు.