Home » kaleshwaram
కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి నిర్మాణ సంస్థలు తక్షణ మరమ్మతు ప్రణాళికలు అందించడంలో విఫలమయ్యాయి. ఈ ఎన్‌సీ అధికారులు గురువారం బ్యారేజీలను సందర్శించి రక్షణ చర్యలపై ఆదేశాలు ఇవ్వనున్నారు.
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. విచారణకు హాజరవుదామా లేక లిఖితపూర్వక వివరణ ఇవ్వాలా అన్న దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు.
కాళేశ్వరం కమిషన్ దూకుడుతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిందా.. ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ చూస్తోందా.. ఇంతకీ ఆ ముగ్గురి విచారణతో కాంగ్రెస్ ఏ విధంగా లాభం పొందాలని చూస్తోంది..
Bandi Sanjay: సరస్వతి పుష్కరాలను కేవలం ఒక ఏరియాకే మాత్రమే పరిమితం చేయడం సరికాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సరస్వతీ పుష్కరాలను సరిగా నిర్వహించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాళేశ్వర క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరిగిపోతుండడంతో కాళేశ్వరం క్షేత్రంలో వీధులన్నీ సందడిగా మారాయి.
తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మే15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు.
ఈసారి గోదావరి వరదలు మేడిగడ్డను మళ్లీ ముంచే అవకాశముందా అనే సందేహం వేగంగా వినిపిస్తోంది. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ మరమ్మతులకు ముందడుగు వేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) అందించిన నివేదికపై మే 2న అధికారులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు.
18 నెలలుగా కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. నివేదిక నెలాఖరున ఇవ్వనున్నట్టు ఎన్‌డీఎస్‌ఏ అధికారులు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.