Home » Kaleshwaram Project
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల తయారీ నైపుణ్యం, సామర్థ్యాలు తమకు లేవని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్(సీఈ) చెప్పడాన్ని నీటిపారుదల శాఖ తీవ్రంగా పరిగణించింది.
ఇద్దరు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)లు, ఒక ఈఈ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ఈ ముగ్గురూ అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ అవినీతి ఆరోపణలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావు అక్రమాలు భారీగా వెలుగులోకి రావడంతో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన మరికొంత మంది అవినీతి ఇంజనీర్లపై విచారణ చేయాలని ED సిద్ధమైంది.
ACB Raids On Ex ENC: హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. మురళీధర్ కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా అక్రమస్తులను ఏసీబీ గుర్తించినట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో ప్రతిరోజూ లెవల్స్ రీడింగ్ తీసుకుంటున్నారు. మిగతా బ్లాకుల్లో రెండు వారాలకు ఒకసారి రీడింగ్ నమోదు చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ చేతకాని రేవంత్ సర్కార్.. రైతాంగానికి నీళ్లు ఇవ్వలేకపోతున్నది. ప్రాజెక్టు నిర్వహణను కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి చూపిస్తారు.
కాళేశ్వరం బ్యారేజీలు, కృష్ణా జలాలపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చిద్దాం. ఏ రోజైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధం. సభ జరుగుతున్నప్పుడు కెమెరా తిప్పొద్దు.
ఖరీఫ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 44, 570 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 39,320 ఎకరాలు ఆరుతడి పంటలు కాగా... 5,250 ఎకరాల వరి పంటకు నీళ్లివ్వనున్నారు.
కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఎదుట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు విచారణకు హాజరయ్యారు. బీఆర్కే భవన్లో మరోసారి పీసీ ఘోష్ కమిషన్ను హరీష్రావు కలిశారు.
కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సమస్యలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది.