Home » JNTU
జేఎన్‌టీయూ(JNTU) పరీక్షల విభాగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఉన్నతాధికారులు నియమించిన కమిటీ విచారణను ప్రారంభించింది. కమిటీకి చైర్మన్, కన్వీనర్‌లను నియమించారు.
గత కొన్నేళ్లుగా విజయవంతంగా ఎంసెట్/ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహిస్తున్న జేఎన్‌టీయూ(JNTU)కే మరోసారి బాధ్యతలు అప్పగించారు.ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) అనగానే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది జేఎన్టీయూనే.
జేఎన్‌టీయూ(JNTU) పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియలో అంతులేని జాప్యం అభ్యర్థుల సహనానికి పరీక్ష పెడుతోంది. గతేడాది జనవరిలో పీహెచ్‌డీ అడ్మిషన్ల(PhD Admissions) కోసం వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ ఇవ్వగా, ఏడాదవుతున్నా ప్రవేశాల ప్రక్రియకు ఫుల్‌స్టాప్ పెట్టడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు.
ఈ నెల 15న (కనుమ పండగ) ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడంలేదని, ఆ రోజు జరగాల్సిన పరీక్షలను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ అధికారులు స్పష్టం చేశారు.
జేఎన్‌టీయూ(JNTU)లో 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఇంకా అరకొర వేతనాలే ఇస్తున్నారని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ బాలకిష్టారెడ్డి(University in-charge VC Balakishta Reddy)ని కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు.
సర్పవరంజంక్షన్, డిసెంబరు29(ఆంధ్రజ్యోతి): కాకినాడలో నిర్వహిస్తున్న క్రియ పిల్లల పండుగ అంబరాన్నంటింది. రెండురోజులపాటు జరిగిన పోటీల్లో విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో పా ల్గొన్నారు. సంప్రదాయ దుస్తులతో సాంస్కృతిక నృత్యప్రదర్శనలు, మైమరిపించే కోలాట నృ త్యాలు, అబ్బురపరిచే రీతిలో
జేఎన్‌టీయూ(JNTU) విద్యార్థులకు కొత్త సంవత్సరంలో సరికొత్త సదుపాయాలు అందుబాట్లోకి రానున్నాయి. వర్సిటీలోని వివిధ విభాగాలతో పాటు అన్ని హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నిరంతరాయమైన ఇంటర్నెట్ (హై-ఫై)సదుపాయాన్ని కల్పించాలని ఇన్‌చార్జి వీసీ డాక్టర్ బాలకిష్టారెడ్డి(In-charge VC Dr. Balakishta Reddy) నిర్ణయించారు.
జేఎనటీయూ విద్యార్థులకు అత్యధిక వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తున్నా మని ఇనచార్జ్ వీసీ ప్రొఫెసర్ సుదర్శన రావు తెలిపారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను గురువారం వీసీ సుదర్శనరావు, రిజిస్ర్టార్ క్రిష్ణయ్య, ఓఎస్డీటూ వీసీ దేవన్న అభినం దించారు.
ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలకు కొలువుగా నిలవాల్సిన జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ(Jawaharlal Nehru Technological University) ప్రాంగణం కొన్నాళ్లుగా భారీ ట్రక్కులు, కంటెయినర్లకు పార్కింగ్ స్థలంగా మారింది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జేఎన్‌టీయూ(JNTU)కు ఉపకులపతి ఉన్నట్టా, లేనట్టా.. అని ఇటు విద్యార్థులు, అటు ఆచార్యులు సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత మే నెల 21న వైస్ చాన్స్‌లర్‌గా కట్టా నర్సింహారెడ్డి పదవీకాలం ముగియడంతో.. 22నుంచి ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టారు.