Share News

Mega Job: 1న జేఎన్‌టీయూలో మెగా జాబ్‌ ఫెయిర్‌

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:35 AM

మార్చి 1న జేఎన్‌టీయూలో మెగా జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ టి.కిషన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Mega Job: 1న జేఎన్‌టీయూలో మెగా జాబ్‌ ఫెయిర్‌

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): మార్చి 1న జేఎన్‌టీయూలో మెగా జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ టి.కిషన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నిపుణ- సేవా ఇంటర్నేషల్‌ సహకారంతో చేపట్టిన ఈ జాబ్‌ ఫెయిర్‌ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. జాబ్‌ మేళా ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఐటీ, ఐటీయేతర ఫార్మా, ఇంజినీరింగ్‌, బ్యాంకింగ్‌, రిటైల్‌, తయారీ, మేనేజ్‌మెంట్‌ రంగాల్లో 10వేలకు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరలో ఇదే తరహా జాబ్‌ మేళాలను వర్సిటీకి అనుబంధంగా ఉన్న మంథని, జగిత్యాల జేఎన్‌టీయూ క్యాంప్‌సలో నిర్వహిస్తామన్నారు.

Updated Date - Feb 25 , 2025 | 04:35 AM