Home » JDS
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల బాధితురాలిని అపహరించారనే కేసులో ఆయన తండ్రి, జనతాదళ్ సెక్యులర్ నేత, హోలెనర్సిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ సోమవారంనాడు మంజూరు చేశారు.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. 196 దేశాలతో పాటు, ఇంటర్‌పోల్‌కు సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిపింది. ప్రజ్వల్ ఏ దేశంలోనైనా, విమానాశ్రయాలు, ఓడరేవుల్లో కనిపించినా సమాచారం ఇవ్వాలని ఇంటర్‌పోల్‌ను కోరామని పేర్కొంది.
అత్యాచారానికి గురైన అనేక మంది మహిళలు సమాజంలో వివక్ష ఎదుర్కొంటుండటంతో వారికి ఆర్థిక సాయం అందించేందుకు సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) సర్కార్ నిర్ణయించింది. అత్యాచార బాధితులందరికీ ఆర్థిక సాయం చేయడానికి విధివిధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
జనతాదళ్ సెక్యులర్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై(Prajwal Revanna) లైంగిక వేధింపుల ఆరోపణలపై రాజకీయ దుమారం రేగడంతో ఆయనకు లుక్ అవుట్ నోటీసులు(Lookout Notice) జారీ అయ్యాయి.
లోక్‌సభ ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన అభ్యంతకర వీడియోల స్కాండల్ పై హసన్ సిట్టింగ్ ఎంపీ, జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించారు. త్వరలోనే నిజం నిగ్గు తేలుతుందని అన్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండైన జనతాదళ్ (సెక్యులర్) నేత ప్రజ్వల్ రేవణ్ణ ఈ వారంలోనే జర్మనీ నుంచి తిరిగి రానున్నట్టు అధికార వర్గాల సమాచారం. మే 3-4 తేదీల మధ్యలో ఆయన స్వదేశానికి తిరిగి వస్తారని చెబుతున్నారు. సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసుపై సిట్ దర్యాప్తు జరుపుతోంది.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను హెచ్ డీ దేవగౌడ మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వీడియోలు ఓ కుదుపు కుదిపేశాయి. అదీకూడా లోక్‌సభ ఎన్నికల వేళ.. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతో కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీకి సరైన సమయంలో.. సరైన ఆయుధం దొరికినట్లు అయింది.
కర్ణాటక రాజకీయాలను జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వీడియోలు కుదిపేస్తున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జేడీ(ఎస్) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజ్వల్ రేవణ్ణపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే హాసన్ లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ ప్రజ్వల్ జేడీ(ఎస్) అభ్యర్థిగా బరిలో దిగారు.
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని క్షమించే ప్రసక్తే లేదని..
మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చేదు అనుభవం ఎదురైంది. సామాజిక మాధ్యమాల్లో రేవణ్ణను సంబంధించినట్టు చెబుతున్న ఒక అశ్లీల వీడియో పోస్ట్ కావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.