Home » Jagtial
నిరుపేద బాలికలకు అందుబాటులో నాణ్యమైన విద్యతో పాటు బలవర్ధక ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కొత్త మెనూను అమల్లోకి తెచ్చింది. బాలికలు మధ్యలో చదువు ఆపేయకుండా, వారిని అక్కున చేర్చుకుని కేజీబీవీలు వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.
మండలంలోని కల్వల ప్రాజెక్టును పాలకులు పట్టించుకోవడం లేదు. కల్వల ప్రాజెక్టుకు రెండేళ్ల క్రితం గండి పడింది. అప్పటి ప్రజాప్రతినిధుల ఆదేశాలతో అధికారులు తాత్కాలికంగా మరమ్మత్తులు చేసి రైతులకు సాగునీరు అందించారు. గత వర్షాకాలంలో వరద ఉధృతి పెరగడంతో తాత్కాలికంగా నిర్మించిన రింగ్ బండ్ తెగింది.
జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకానికి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా 1,875 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టేందుకు జిల్లా వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆసక్తి ఉన్న రైతులను ఎంపిక చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం లేకుండా సహజ సిద్ధంగా ప్రకృతి వ్యవసాయాన్ని చేసేలా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది.
జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల విస్తరణలో భాగంగా 2020లో జగిత్యాలలో మెడికల్ కాలేజీకి జాతీయ వైద్య కమిషన్ అనుమతులు మంజూరు చేసింది.
సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడిచినా కౌలు రైతుల ఆశలు నెరవేరడం లేదు.
ప్రైవేటు పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడానికి ప్రణాళికలు చేస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం ఎంత ముఖ్యమో తిరిగి భద్రంగా ఇంటికి చేరడం అంతే ప్రధానంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో నిత్య చైతన్యంగా ఉండే కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, శ్రేణులు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకు ఇక్కడ తమ పార్టీ అధికారంలోనే ఉందా.. ఇన్‌చార్జి మంత్రి ఉన్నట్టా.. లేనట్టా.. ఉంటే నెలలు గడిచినా ఆయన జిల్లాకు ఎందుకు రాడు, జిల్లా కేంద్రానికి కీలకంగా ఉండే కరీంనగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు మంజూరు కావడం లేదు.. అసలు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలే ఎందుకు ఏర్పాటు కావడం లేదు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
రాష్ట్రంలో పచ్చదనాన్ని విస్తరింపజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం యేటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించగా కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటుతోంది.
యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా సన్నరకాల బోనస్ ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించలేదు. ఈ సీజన్‌లో కొనుగోలు చేసిన సన్న, దొడ్డు ధాన్యానికి చెందిన డబ్బుల్లో 83 శాతం ఇప్పటికే చెల్లించింది. సన్న ధాన్యంపై క్వింటాలుకు 500 రూపాయల చొప్పున ఇస్తానన్న బోనస్ సొమ్ము మాత్రం ఇప్పటికీ చెల్లించ లేదు.
వరిలో సన్నరకం పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ క్షేత్ర స్థాయిలో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలకు దొడ్డురకంతో పాటు సన్నరకం ధాన్యం వస్తోంది. అయితే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి వారం, పది రోజులు గడుస్తున్నప్పటికీ బోనస్ డబ్బులు మాత్రం వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.