Home » Jagan Mohan Reddy
నెల్లూరు నగరంలోని బుజబుజ నెల్లూరు ప్రాంతంలో ఆరేళ్లుగా మూలన పడి ఉన్న చెత్త తరలింపు వాహనాలన్నీ పేదలకు పంపిణీ చేయాల్సినవని తేలింది.
చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీసు శాఖలోని వారిని హెచ్చరిస్తున్నా మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది.
వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటన అంతా అబద్ధాలు, కట్టు కథలతో సాగింది. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పి అబద్ధాలను నిజం చేయాలని తెగ తాపత్రయపడ్డారు.
పల్నాడు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
పరామర్శ పేరుతో బలప్రదర్శన చేశారు. అనుమతులు లేకపోయినా భారీగా జనసమీకరణ చేసి రచ్చ రచ్చ చేశారు. బారికేడ్లను తోసివేసి, అడ్డుకోబోయిన పోలీసులను నెట్టివేశారు.
ఒక రాజకీయ పార్టీ ఇలా ఉంటుందా... ఒక పార్టీ కార్యకర్తలు ఇలా వ్యవహరిస్తారా... ఒక పార్టీ అధ్యక్షుడికి పద్ధతీ పాడూ ఉండక్కర్లేదా... అని జనం ఈసడించుకునే స్థాయిలో వైసీపీ క్షుద్ర రాజకీయం చేస్తోంది.
జగన్ శవ రాజకీయాలు చేస్తూ తాజాగా ఇద్దరి మరణానికి కారణమయ్యారని రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.
జగన్ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం వ్యవహారంలో మరో కొత్తపాత్ర తెరపైకి వచ్చింది. కీలక నిందితుడు, గత ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభస్థానంలో వైసీపీ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో ఆయనకున్న లింకేమిటో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా ఆరా తీస్తోంది.
ఫోన్ ట్యాపింగ్... మాజీ సీఎం జగన్ హయాంలో జరిగిన ఎన్నో అరాచకాలకు ఇదే కీలకం. అప్పట్లో రాజకీయ ప్రత్యర్థుల నుంచి న్యాయమూర్తుల వరకూ ఎవరినీ వదల్లేదు. చివరకు సొంత పార్టీ నేతలు, మంత్రులు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్ సంభాషణలపై కూడా దొంగచాటుగా ఓ చెవి వేశారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఆ పార్టీ నేతలది అరాచక బాటే.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందంటూ ఏడాది క్రితం బెట్టింగ్‌లు కట్టి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు..