Share News

Minister Parthasarathi: సంఘ విద్రోహశక్తులను ప్రోత్సహిస్తున్న వైసీపీ

ABN , Publish Date - Jul 01 , 2025 | 05:48 AM

అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం కృషిచేస్తుంటే వైసీపీ సంఘ విద్రోహశక్తులను ప్రోత్సహిస్తూ విధ్వంసం సృష్టించేందుకు తెగించిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు

Minister Parthasarathi: సంఘ విద్రోహశక్తులను ప్రోత్సహిస్తున్న వైసీపీ

  • విధ్వంసకరంగా జగన్‌ యాత్రలు: మంత్రి పార్థసారథి

పంగులూరు, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం కృషిచేస్తుంటే వైసీపీ సంఘ విద్రోహశక్తులను ప్రోత్సహిస్తూ విధ్వంసం సృష్టించేందుకు తెగించిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. బాపట్ల జిల్లా పంగులూరు మార్కెట్‌ యార్డ్‌లో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘రైతుల పరామర్శ పేరుతో జగన్‌ చేపడుతున్న యాత్రలు విధ్వంసకరంగా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టే వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు వైసీపీ భూతాన్ని తిరిగి రానీయమని గట్టిగా చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది’ అని అన్నారు. పొగాకు రైతులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కలెక్టర్‌ వెంకట మురళి పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 05:48 AM