Home » ISRO
ఇస్రో మహాద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం.. షార్‌లో వందో మిషన్.. విజయవంతమైంది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదికపై నుంచి బుధవారం ఉదయం 6:23 గంటలకు ఇస్రో చేపట్టిన జీఎ్సఎల్వీ-ఎఫ్15 రాకెట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలు 6-23 గంటలకు GSLV F-15 రాకెట్‌ను ప్రయోగించారు. ఇస్రోకి ప్రతిష్ఠాత్మకమైన వందవ ప్రయోగం. ఇది నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది. ఈ ప్రయోగం విజయవంతమైంది.
1979 నుంచి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ప్రయోగాలు చేస్తున్నామని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. బుధవారం నిర్వహించే జీఎస్ఎల్వీ ఏఫ్-15 శాటిలైట్ ప్రయోగం వందోదిగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రయోగంతో నావిగేషన్‌ను సులభంగా వినియోగించుకునే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు.
పదిహేడు రోజుల ఉత్కంఠభరిత నిరీక్షణకు తెరపడింది! భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్ఠాత్మక స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది! కొంత సమయం తేడాతో.. ఒకే లాంచింగ్ వాహనం ద్వారా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన 2 ఉపగ్రహాలూ సక్సె్‌సఫుల్‌గా అనుసంధానమయ్యాయి!
ISRO: గత డిసెంబర్ 30న షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ 60 పీఎస్ఎల్వీలో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించింది. ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ బయలుదేరిన 15 గంటల 9 నిమిషాలకు స్పేడెక్స్ 1బీ, 15 గంటల12 నిమిషాలకు స్పేడెక్స్ 1ఏ రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తరువాత వీటి డాకింగ్ కోసం మూడు సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది.
అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించడం కోసం రూ.370 కోట్ల వ్యయంతో చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో ముందడుగు వేసినట్టే కనిపించిన ఇస్రో మరోసారి వెనక్కు తగ్గింది...! శనివారం సాయంత్రం ఎస్‌డీఎక్స్01, ఎస్‌డీఎక్స్02 ఉపగ్రహాల మధ్య దూరం 230 మీటర్లు ఉంది.
పేద కుటుంబంలో పుట్టి.. పైకప్పు కూడా సరిగాలేని పాఠశాలలో తమిళ మాధ్యమంలో చదివిన వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాత ఇస్రో సంస్థకు చైర్మన్ అవుతారని ఊహించగలమా..!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్‌గా వీ నారాయణన్ నియమితులయ్యారు.