Share News

సీఈ20 క్రయో ఇంజన్‌ పరీక్ష సక్సెస్‌

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:36 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మన బాహుబలి రాకెట్‌ ‘జీఎ్‌సఎల్వీ మార్క్‌3’లో పలు మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటిదాకా క్రయో ఇంజన్‌ దశను 25 టన్నులతో రూపొందిస్తుండగా దాన్ని 20 టన్నులకు కుదించి నిర్మించడానికి మార్గం సుగమం కాబోతోంది.

సీఈ20 క్రయో ఇంజన్‌ పరీక్ష సక్సెస్‌

సూళ్లూరుపేట, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మన బాహుబలి రాకెట్‌ ‘జీఎ్‌సఎల్వీ మార్క్‌3’లో పలు మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటిదాకా క్రయో ఇంజన్‌ దశను 25 టన్నులతో రూపొందిస్తుండగా దాన్ని 20 టన్నులకు కుదించి నిర్మించడానికి మార్గం సుగమం కాబోతోంది. ఇందుకు సంబంధించిన సీఈ20 క్రయో ఇంజన్‌ పరీక్షను మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌ (ఐపీఆర్‌సీ)లో విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ఎక్స్‌లో పేర్కొంది. ఎల్‌వీఎం3 రాకెట్‌ క్రయోజనిక్‌ అప్పర్‌ స్టేజ్‌లో ఉపయోగించే స్వదేశీ క్రయోజనిక్‌ ఇంజన్‌ (సీఈ20) కోసం ఇప్పటి వరకు ఐపీఆర్‌సీలో హై-అల్టిట్యూట్‌ టెస్ట్‌ను (హెచ్‌ఏటీ) ఐదుసార్లు నిర్వహించారు.


నాజిల్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌ను ఉపయోగించి ఇంజన్‌ను 100 సెకన్ల పాటు మండించి క్రయో పరీక్ష విజయవంతంగా చేశారు. ఆరోసారి చేపట్టిన క్రయో దశ హాట్‌టెస్ట్‌ విజయవంతం కావడంతో భవిష్యత్‌ ప్రయోగాలకు మార్గం సుగమమైంది. ఇస్రో తలపెట్టిన ఈ పరీక్ష ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి మరింత సౌకర్యంగా, సులువుగా చేర్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ పరీక్ష విజయవంతంతో భవిష్యత్‌లో ఇస్రో ఆఽధ్వర్యంలో జరిగే భారీ ప్రయోగాలకు మరింత బలాన్నిస్తుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా చెబుతున్నారు.

Updated Date - Mar 16 , 2025 | 05:36 AM