Home » Indian Railways
పవిత్రమైన శ్రావణ మాసంలో హలాల్ టీ ఇచ్చిన రైల్వే ఉద్యోగిపై ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భక్తిశ్రద్ధలతో పూజ చేసుకోవలసి ఉందని, అటువంటి సమయంలో ఓ మతపరమైన సర్టిఫికేషన్ ఉన్న టీని ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై ఆ ఉద్యోగి మాట్లాడుతూ, టీ శాకాహారమేనని ఆ ప్రయాణికునికి నచ్చజెప్పారు.
పేదలను దృష్టిలో పెంచుకుని రైల్వే శాఖ వందే భారత్ రైళ్లలో సరికొత్త వేరియంట్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు వందే భారత్ స్లీపర్, వందే మెట్రో, వందే సాధారణ్ రైళ్లను పరిచయం చేయనుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వందే సాధారణ్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి.
కర్నాటక: బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే డబుల్ డెక్కర్ రైల్లో ప్రమాదం జరిగింది. రైలు గుడియాత్తం స్టేషన్ చేరుకోగానే మంటలు వ్యాపించాయి. మంటలు, పొగలు గమనించిన రైల్వే సిబ్బంది రైలును స్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
రైల్వేశాఖ మరో నాలుగు వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా తెచ్చిన రైళ్లలో ఢిల్లీ-చండీగఢ్ (243 కి.మీ), చెన్నై-తిరునల్వేలి (622 కి.మీ), గ్వాలియర్- భోపాల్ (432 కి.మీ), లక్నో-ప్రయాగ్‌రాజ్ (200 కి.మీ) ఉన్నాయి.
మన దేశంలో రైల్వే వ్యవస్థ ఎంతగానే అభివృద్ధి చెందింది. పెద్ద పెద్ద నగరాల నుంచి అనేక చిన్న చిన్న ప్రాంతాలకు రైళ్లు వెళుతున్నాయి. అలాగే ఎంతటి దూరాన్ని అయినా సరే వీలైనంత త్వరగా చేరుకునేలా వందే భారత్ వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు కూడా వచ్చాయి. అయితే రైల్వే వ్యవస్థ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ అందులోని కొన్ని సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి.
రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. సీటింగ్ అకామడేషన్ ఉన్న ఏసీ రైళ్లలో ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే జోన్లను ఆదేశించింది. గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఈ రైళ్లలో ఈ ఆఫర్‌ను ప్రకటించాలని తెలిపింది.
బాలాసోర్ ఘోరరైలు ప్రమాదం ఘటనపై రైల్వే మంత్రిత్వశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సౌత్ ఈస్టర్న్ రైల్వేకు చెందిన పలువురు సీనియర్ అధికారులను బదిలీకి ఉత్తర్వులు జారీ చేసింది.
ఓ కుర్రాడు తన స్నేహితుడితో కలసి ట్రైన్ జర్నీ చేస్తున్నాడు. అతను రాత్రి 2గంటల సమయంలో టాయిలెట్ కు వెళ్ళాల్సి వచ్చింది. తన బెర్త్ దిగగా అతనికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను టాయిలెట్ కు వెళ్ళడానకి పడిన అవస్థలు చూస్తే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదు.
శ్రీ సత్యసాయి జిల్లా: రైల్వే ప్యాంట్రీ సిబ్బందిపై సత్యసాయి జిల్లా ఏఆర్ పోలీసుల వీరంగం సృష్టించారు. పుట్టపర్తికి వచ్చేందుకు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌లో అనంతపురం వద్ద ప్యాంట్రీ బోగిలోకి ఏఆర్ పోలీసులు ఎక్కారు.
న్యాయంగా సంపాదించిన డబ్బుల నుంచే ఈ 10 కోట్ల విరాళాన్ని ఇస్తున్నట్లు వెల్లడించాడు. అందుకు సంబంధించిన ఐటీ రిటర్న్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా జత చేసి పంపించాడు. తన విరాళం డీడీ ద్వారా పంపేందుకు వివరాలు అందజేయాలని లాయర్ ద్వారా రైల్వే శాఖకు సుకేశ్ విజ్ఞప్తి చేశాడు. కానీ సుకేశ్ విరాళాన్ని అంగీకరించాలో లేదో తెలియక