Home » Indian Army
పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై భారత త్రివిధ దళాల అధికారులు స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్లమెంట్‌పై దాడి నుంచి తాజాగా జరిగిన పహల్గామ్ దాడి వరకూ మొత్తం 350 మంది పౌరులు మృతి చెందారని చెప్పారు.
TDP Supports ON Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌కు టీడీపీ పూర్తి మద్దతు తెలిపింది. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు భారత బలగాలకు అభినందనలు తెలిపారు. పాకిస్తాన్‌పై ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు అభినందనీయమని టీడీపీ నేతలు కొనియాడారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సాయుధ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో చనిపోయిన బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభ్వుతానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాయి.
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌లో భారత్ పాకిస్తాన్‌లోని లష్కరే జైష్ హిజ్బుల్‌కు చెందిన 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మసూద్ అజార్ రహస్య స్థావరాన్ని కూడా పేల్చివేశారు. ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన ఈ ఉగ్రవాద శిబిరాల గురించి తెలుసుకుందాం..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మేరా భారత్ మహాన్.. జైహింద్ అని పలువురు ప్రముఖులు మద్దతు పలికారు.
పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా భారత బలగాలకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న చర్యలను పవన్ కల్యాణ్ ప్రశంసించారు.
Minister Ponnam Prabhakar: హైదరాబాద్‌లో ఉన్న కంటోన్మెంట్ ఏరియాల ద్వారా ప్రజలను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, పరిస్థితులు కనిపిస్తే దగ్గరలోని పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
Daggubati Purandeswari: పాకిస్తాన్‌లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి భారత్ దీటైన జవాబు ఇవ్వడం ఖాయమని పురంధేశ్వరి తెలిపారు.
జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. అయితే ఈ ఆపరేషన్‌సపై చైనా స్పందించింది.
Asaduddin Owaisi: ఆపరేషన్ సింధూర్‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలిపారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగాలు లక్ష్యంగా చేసుకున్న దాడులను తాను స్వాగతిస్తున్నానని అన్నారు.