Home » India vs South Africa
మంగళవారం నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. సెంచూరియన్ వేదికగా ఈ నెల 26 నుంచి తొలి టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. దీంతో ఈ సారి సౌతాఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
Sunil Gavaskar: మంగళవారం నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటివరకు సఫారీ గడ్డపై ఒకసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవని టీమిండియా ఈ సారి ఆ లోటు తీర్చుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
దక్షిణాఫ్రికా నుంచి అకస్మాత్తుగా భారత్ వచ్చిన టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టుతో కలిశాడు. డిసెంబర్ 26 నుంచి మొదలుకానున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడనున్నాడు. సెలవు తీసుకున్న మూడు రోజులు కోహ్లీ లండన్‌లో ఉన్నాడని, ఈ మేరకు తన ప్రణాళికలను ముందుగానే టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేశాడని బీసీసీబీ వర్గాలు వెల్లడించాయి.