Home » Hyderabad News
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ నకిలీ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడులు పెట్టి వందలాది మంది నిండా మునిగారు.
కన్న కూతురి పాలిట తల్లే దయ్యమైంది! తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. తన 16 ఏళ్ల కూతురిపై కన్నెస్తే అపర కాళికలా మారి, బుద్ధి చెప్పాల్సింది పోయి.. అతడికి సహకరించింది.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారంతా ఉన్న ఆస్తులను కోల్పోతే.. బీఆర్‌ఎస్ నేతలు మాత్రం రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నారని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్, ఆయన అనుచర వర్గం రాష్ట్రాన్ని దోచుకుని వందల ఎకరాల భూముల్లో ఫాంహౌ్‌సలు నిర్మించుకున్నారని తెలిపారు.
డ్రగ్స్, సైబర్ నేరాల కేసుల్లో బెయిల్‌పై విడుదలైన పలువురు నిందితులు తర్వాత కోర్టుకు హాజరుకాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్లు ప్రత్యేక తనిఖీల్లో వెల్లడైంది. డ్రగ్స్ కేసుల్లో 3,228 మంది, సైబర్ కేసుల్లో 115 మంది ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి వారెంట్‌ల అమలుపై దృష్టి సారించారు.
హరీశ్‌రావు రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ, రాష్ట్రంలో కరువు, విద్యుత్తు కోతలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, ప్రజలు మళ్లీ కేసీఆర్‌కు మద్దతు ఇస్తారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయానికి ఏం పేరు పెడితే బాగుంటుందో సూచించాలని ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఎయిర్‌పోర్టు కల సాకారం కాబోతుందని శనివారం ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
భారత్‌లో పెరుగుతున్న ఊబకాయ సమస్యతో వెయిట్‌లాస్ మార్కెట్ విస్తరిస్తోంది. సోషల్ మీడియా ప్రకటనలను నమ్మి అనధికార చికిత్సలు తీసుకోవద్దని, నిపుణుల సలహాతో బరువు తగ్గాలని వైద్యులు సూచిస్తున్నారు.
‘నీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం’ అని నమ్మించారు. స్నేహితుడిని బ్రిటన్ నుంచి స్వదేశానికి రప్పించారు. తీరా వచ్చాక అతన్ని కిడ్నాప్ చేశారు.
స్నేహంతో తనను ఎవరైనా గెలవవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తానెవరికీ గులాం కాదని, కేవలం స్నేహానికి మాత్రమే గులాంనని వ్యాఖ్యానించారు. తననెవరూ భయపెట్టలేరని, ధమ్కీ ఇవ్వలేరని చెప్పారు.
పదిహేనేళ్ల బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో జరిగింది.