Home » High Court
శబరిమలకు వచ్చే భక్తుల భద్రత ముఖ్యమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. రెండు వేర్వేరు తీర్పుల్లో.. విద్యుదాఘాతం వంటి ఘటనలు జరగకుండా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విభాగాలు, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)లను ఆదేశించింది.
స్వదేశంపై ఎలాంటి విమర్శలు చేయకుండా, వేరే దేశాన్ని పొగిడినంత మాత్రాన అది నేరం కిందికి రాదని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్ వేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
సీఎం రేవంత్‌రెడ్డిపై ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తీర్పు ఇచ్చినందుకు జస్టిస్ మౌషమీ భట్టాచార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫిర్యాదుదారు ఎన్. పెద్దిరాజు, ఆయన న్యాయవాదులు ఇద్దరు హైకోర్టుకు క్షమాపణ తెలియజేశారు.
నెట్‌వర్క్ కేబుల్ వైర్ల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రామంతాపూర్ ఘటన తర్వాత హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు కట్ చేశారు. వైర్లకు తిరిగి కనెక్షన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఎయిర్‌టెల్ సంస్థ కోరింది. అయితే, ఎయిర్‌టెల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఇటీవల రామంతాపూర్‌లో విద్యుత్ షాక్ ఘటన అనంతరం కేబుల్ వైర్లను అధికారులు కట్ చేసిన అనంతరం మరోసారి ఈ కేసు హైకోర్టు విచారణకు రానుంది. తిరిగి కనెక్షన్లకు అనుమతించాలని కోరుతూ టెలికాం ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పరిస్థితి ఏంటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘నివేదికను అసెంబ్లీలో పెట్టడానికి ముందే చర్యలు తీసుకుంటారా..
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు కాళేశ్వరం కమిషన్ నివేదికపై వేసిన పిటిషన్లపై తెలంగాణ హై కోర్టులో గురువారం విచారణ జరిగింది. రెండు పిటిషన్లను కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించింది. ఐదు అంశాలను ప్రేయర్‌గా పిటిషనర్లు పేర్కొన్నారు.
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌లో ప్రవేశించరాదని బీజేపీ ఎస్పీ మోర్చా నాయకుడు నెడుకుండ్రం సూర్యకు నగర పోలీసు కమిషనర్ జారీచేసిన ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. నెడుకుండ్రం సూర్యపై పలు కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో, ఆయనను నగరంలో ప్రవేశించేందుకు ఎందుకు నిషేధం విధించరాదు అంటూ వివరణ కోరుతూ కొళత్తూర్ పోలీసు అసిస్టెంట్ కమిషనర్ నోటీసు జారీచేశారు.
మేజర్ అయిన యువతిని ఆమె అభీష్టానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ హోంలో నిర్బంధించలేరని హైకోర్టు స్పష్టంచేసింది.