Share News

High Court: మార్గదర్శిపై కేసు కొట్టివేత

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:13 AM

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చట్టానికి విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణల కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది.

High Court: మార్గదర్శిపై కేసు కొట్టివేత

  • రామోజీరావు మరణం నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చట్టానికి విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణల కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. యజమాని రామోజీరావు మరణించిన నేపథ్యంలో ఇక ఆ సంస్థపై కేసు అవసరం లేదని స్పష్టం చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ దాఖలు చేసిన రెండు క్వాష్‌ పిటిషన్లను అనుమతించి ఆ సంస్థపై నాంపల్లి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు కోర్టులో ఉన్న కేసును కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్‌ శ్యాంకోషీ, జస్టిస్‌ కే సుజనల ధర్మాసనం నిర్ణయాన్ని వెలువరించింది.

Updated Date - Aug 05 , 2025 | 05:13 AM