Home » Harish Rao
ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకుండా వారిని మోసం చేశారని ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
Harish Rao: విషయం లేకనే.. సీఎం రేవంత్ రెడ్డి బూతులు ఎత్తుకున్నారని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. బేసిన్‌కు బాసిన్‌కు తేడా తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే ఎంపీల మీటింగ్ ఏర్పాటు చేశారన్నారు.
కంచ గచ్చిబౌలి భూములను తనఖా పెట్టి టీజీఐఐసీ ద్వారా రూ.10 వేల కోట్ల అప్పు తీసుకున్న విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ సెబీ చైర్మన్‌కు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు.
ఓడిపోతామనే భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. దమ్ముంటే 40 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ ఆయన సవాల్ విసిరారు.
మేడిగడ్డకు చిన్న మరమ్మతులు చేసి గోదావరి నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉన్నా.. బీఆర్‌ఎ్‌సను బదనాం చేయాలనే ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Harish Rao: కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అయ్యాయని, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలు సీఎం రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని.. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు.
మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్కకు ఆదివారం హరీశ్‌రావు లేఖ రాశారు.
రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్’ అంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేస్తున్న ఫెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
మాజీ మంత్రి హరీశ్‌రావు ‘రప్పారప్పా‘ ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడే వారు ఎవరూ లేరని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ఇది కేడీల రాజ్యం.. బేడీల రాజ్యం అని, సీఏం ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. కోతల రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.