Home » Guntur
వైసీపీ పాలనలో ఏపీలో విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. విభజన కంటే వైసీపీ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయని.. దారిలో పెడుతున్నామని వెల్లడించారు.
బాపట్ల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సూరేపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరయ్యారు. మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు.
గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓవరాక్షన్ చేశారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఆంద్రజ్యోతి కార్యాలయంవైపుకు దూసుకెళ్లేందుకు యత్నించిన అంబటిని పోలీసులు అడ్డుకున్నారు.
గుంటూరు జిల్లా మాచర్లలో మహిళపై అత్యాచారం జరిగిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రియుడే అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు.
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్ అని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మా రాజధాని అమరావతి అని ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22A పేరుతో విశాఖలో వేల ఎకరాల చుక్క భూములను కబ్జా చేయడాన్ని దోపిడీ అంటారని ఎమ్మెల్సీ అనురాధ ఆరోపించారు. అమరావతి అంటే కేవలం భూములు కాదు.. అది ఐటీ హబ్, స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీలు, వేల మంది యువతకు ఉపాధి కల్పించే గ్లోబల్ సెంటర్ అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో అలసత్వంపై మంత్రి ఆగ్రహించారు. నియోజకవర్గాల వారీగా కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత పనుల అంచనాల తయారీపై అధికారులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..
ఏపీ ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చేలా మొత్తంగా రూ.7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కింద రూ.1,848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని, అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి సంబంధించిన రూ.76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేశామని వెల్లడించారు.